జిమ్‌లో ప్రగతి (Pragathi) ఎక్సర్‌‌సైజులు.. మాజీ హీరోయిన్ వర్క్ అవుట్‌ ఫోటోలు వైరల్

Updated on May 16, 2022 09:45 PM IST
జిమ్‌లో వర్క్‌ అవుట్స్​ చేస్తున్న  ప్రగతి (Pragathi)
జిమ్‌లో వర్క్‌ అవుట్స్​ చేస్తున్న ప్రగతి (Pragathi)

వెండితెరపై క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎంతగానో ఆకట్టుకుంటుంది నటి ప్రగతి. తల్లి, అత్త పాత్రలతో సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేస్తున్న ప్రగతి.. ఇంటర్నెట్‌లో హాట్‌ ఫోటోలతో హల్‌చల్‌ చేస్తోంది. సినిమాల్లో సాంప్రదాయ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్న ప్రగతి(Pragathi). హీరోకి తల్లిగానో, అత్తగానో,  క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గానో మెప్పిస్తుంది. స్టార్‌ హీరోల సినిమాల్లో ప్రగతి కచ్చితంగా ఉండాల్సిందే అనేంతగా పేరుతెచ్చుకుంది ప్రగతి. తనదైన స్టయిల్‌లో ఆడియన్స్​ను అలరిస్తోంది. నటనతోపాటు కామెడీ చేయడంలోనూ ప్రగతి స్టయిలే వేరు. వెండితెరపై ట్రెడిషనల్‌ లుక్‌లో ఆకట్టుకునే ప్రగతి.. సోషల్‌ మీడియాలో మరో యాంగిల్‌ని ఆవిష్కరిస్తూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తుంది.

కఠినమైన వర్కౌట్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది వర్కౌట్‌ చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటుంది. అవి సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంటాయి కూడా. తాజాగా ప్రగతి వర్కౌట్‌ చేస్తున్న ఫోటోలను షేర్‌‌ చేసింది. కండలు తిరిగిన దేహంతో, బాడీ బిల్డర్‌ని తలపించేలా ఉంది.  

చాలా కఠినమైన వ్యాయామాలు చేస్తూ కనిపించిన ప్రగతి.. ట్రైనర్‌ సమక్షంలో చెమటోడుస్తోంది.

ప్రగతి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్‌ విషయాలను షేర్‌ చేసుకుంటుంది. ఎక్కువగా జిమ్‌ వీడియోలు, వర్కౌట్‌ ఫోటోలను, డాన్స్​ వీడియోలను పోస్ట్‌ చేస్తుంది. హాట్‌ గా ఉన్న ఫోటోలను షేర్‌ చేస్తూ  సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ పెంచుకుంటుంది.  

ఈ ఫోటోలతో పాటు ప్రగతి పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. `ఏం జరిగినా మీరు మళ్లీ మొదటి నుంచి స్టార్ట్‌ చేయవచ్చు` అంటూ ఇదొక ఉదాహరణ అని చెప్పింది ప్రగతి. విల్‌ పవర్​ని కనిపెట్టడం కాదు, ఆ శక్తిని మీరు సృష్టించుకోవాలి` అని స్ఫూర్తినిచ్చే పదాలను షేర్‌ చేసింది ప్రగతి.  

ప్రగతి నటి మాత్రమే కాదు, సోషల్‌ మీడియాలో మోటివేషనల్‌ పర్సన్‌. తన జిమ్‌ ఫోటోలు, వర్కౌట్‌ వీడియోలు షేర్‌ చేస్తుంటుంది. ఎలా స్ట్రాంగ్‌గా ఉండాలి, బాడీతోపాటు మనసు కూడా బలంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలను పంచుకుంటుంది. విమెన్‌ ఎంపవర్‌మెంట్‌కి సంబంధించిన విషయాలను కూడా చెబుతూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది ప్రగతి.

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి 130 చిత్రాల వరకూ చేసిన  ప్రగతి (Pragathi)  సీరియల్ నటిగా నిరూపించుకుంది. 1998లో టీవీలో వచ్చిన తీర్పు, శ్రీ, 1999 అమ్మ  సీరియల్స్​లో నటించింది. ప్రగతి హీరోయిన్​ అనే విషయం చాలా మందికి తెలియదు. పెళ్లి చేసుకున్నాక హీరోయిన్‌గా సినిమాలకు దూరమైంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మహేష్‌బాబు హీరోగా వచ్చిన బాబి సినిమాతో మొదలైంది. `ఎఫ్‌ 2` సినిమాలో ఆమె చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించింది. ఇప్పుడు `ఎఫ్‌3`తో మరోసారి అలరించేందుకు వస్తోంది. ఎఫ్‌3 ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

జిమ్‌లో వర్క్‌ అవుట్స్​ చేస్తున్న  ప్రగతి (Pragathi)

జిమ్‌లో వర్క్‌ అవుట్స్​ చేస్తున్న  ప్రగతి (Pragathi)

జిమ్‌లో వర్క్‌ అవుట్స్​ చేస్తున్న  ప్రగతి (Pragathi)

జిమ్‌లో వర్క్‌ అవుట్స్​ చేస్తున్న  ప్రగతి (Pragathi)

జిమ్‌లో వర్క్‌ అవుట్స్​ చేస్తున్న  ప్రగతి (Pragathi)

జిమ్‌లో వర్క్‌ అవుట్స్​ చేస్తున్న  ప్రగతి (Pragathi)

జిమ్‌లో వర్క్‌ అవుట్స్​ చేస్తున్న  ప్రగతి (Pragathi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!