ఎఫ్‌3 (F3) నుంచి మరో కొత్త సాంగ్

Updated on Apr 22, 2022 02:20 PM IST
ఎఫ్‌3 నుంచి కొత్త సాంగ్
ఎఫ్‌3 నుంచి కొత్త సాంగ్

విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటిస్తున్న సినిమా ఎఫ్‌3. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూపర్‌‌హిట్‌ సినిమా ఎఫ్‌2కి సీక్వెల్‌గా ఎఫ్‌3 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా రాబోతున్న ఈ సినిమాకి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఎఫ్‌3లో పాట ఇప్పటికే మార్కెట్‌లోకి రిలీజై మంచి రెస్పాన్స్​ దక్కించుకుంది. ఇక, సినిమా మ్యూజిక్ ప్రమోషన్లలో భాగంగా మరో పాటను చిత్ర యూనిట్‌ మార్కెట్‌లోకి విడుదల చేసింది.

కలర్‌‌ఫుల్‌ అండ్‌ గ్లామరస్‌గా ఉన్న ‘ఊ.. ఆ..ఆహా..ఆహా’ అనే పాటను శుక్రవారం రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్. మరోసారి మంచి మ్యూజిక్‌తో రాక్‌స్టార్‌‌ దేవి శ్రీ ప్రసాద్‌ ఆకట్టుకున్నాడు. ఎనర్జటిక్‌గా ఉన్న ఈ సాంగ్‌లో తమన్నా, మెహరీన్‌ అందచందాలకు మరో హీరోయిన్ సోనాల్‌ చౌహాన్ అందాలు మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెంకీ, తేజ్‌ మాస్‌ స్టెప్స్​తో సందడి చేస్తున్నారు. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన యాక్టర్స్‌ అందరూ ఈ పాటలో కనిపిస్తున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా అల్లు అర్జున్‌

దేవి ఎనర్జటిక్ మ్యూజిక్‌కు వెంకీ, వరుణ్‌ స్టెప్స్‌ మరింత ఊపునిస్తున్నాయి. అయితే, ఈ పాటలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పాట మధ్యలో కనిపిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో బన్నీ సెట్‌కు వచ్చిన సమయంలో తీసిన విజువల్స్​ను పాట మధ్యలో చూపించారు. కాసర్ల శ్యామ్‌ అందించిన లిరిక్స్‌ పాటకు మరింత ఎనర్జీ పెరిగింది. సునీల్‌ కూడా తన స్టెప్స్​తో సందడి చేస్తున్నాడు. శేఖర్‌‌ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ‘ఊ..ఆ..ఆహా..ఆహా’ పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది. దిల్‌ రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడనుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!