సినిమా పేర్లు అవే.. మారుతున్న కథలు, నటీనటులు

Updated on May 17, 2022 06:54 PM IST
కొత్త సినిమాలకు పాత టైటిల్స్‌
కొత్త సినిమాలకు పాత టైటిల్స్‌

ప్రేక్షకుడిని థియేటర్‌‌కు రాబట్టేందుకు చిత్ర యూనిట్‌ చాలా కసరత్తులు చేస్తుంది. అందులో అతి ముఖ్యమైనది సినిమా పేరు. టైటిల్‌లో బలం, ఆకర్షణ ఉంటే సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్‌ ఉంది. ఆ సెంటిమెంట్ ప్రకారం పాత టైటిల్‌ అయినా సరే తమ సినిమాకు పెట్టుకునేందుకు వెనుకాడట్లేదు దర్శక నిర్మాతలు. దీంతో పలు హిట్ సినిమా పేర్లు మరోసారి వినిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్‌ ఖుషి సినిమా టైటిల్‌ విజయ్‌ – సమంత సినిమాకి

రికార్డుల ఖుషి.. ఇప్పుడు విజయ్ చేతిలో

పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాల్లో ‘ఖుషి’ మొదటి వరుసలో ఉంటుంది. విజయ్‌ నటించిన తమిళ సినిమా ‘ఖుషి’కి రీమేక్‌గా దర్శకుడు ఎస్‌.జె. సూర్య తెరకెక్కించాడు. ఈ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌‌టైనర్‌‌లోని పాటలు, పవన్‌– భూమిక మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సూపర్‌ హిట్ సినిమా పేరును తమ చిత్రానికి పెట్టుకోవాలని చాలామంది ప్రయత్నించినా కుదరలేదు. తాజాగా ఈ చాన్స్‌ దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్‌కు దక్కింది. విజయ్‌ దేవరకొండ,- సమంత జంటగా నటిస్తున్న సినిమాకి ‘ఖుషి’ టైటిల్‌ను కన్ఫమ్‌ చేసింది. దీంతో 21 సంవత్సరాల తర్వాత ‘ఖుషి’ మరోసారి వెండితెరపై కనిపించబోతోంది. ఈ ఖుషి సినిమా పవన్‌ సినిమా అంతటి ఘన విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

పవన్‌ కల్యాణ్‌ తొలిప్రేమ సినిమా టైటిల్‌ వరుణ్‌ తేజ్ సినిమాకు

పవన్‌ ‘తొలిప్రేమ’.. వరుణ్‌ హీరోగా

పవన్‌ కల్యాణ్‌ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమా ట్రెండ్ సెట్‌ చేసింది. కరుణాకరన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. తొలిప్రేమ టైటిల్‌తో వరుణ్‌ తేజ్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 2018లో మరోసారి వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి మేజర్ సినిమా టైటిల్‌ అడివి శేష్‌ సినిమాకు

అటు చిరంజీవి.. ఇటు అడివి శేష్‌

చిరంజీవి, రవిచంద్రన్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మేజర్’. 1996లో రిలీజైన ‘సిపాయి’ సినిమాకి రీమేక్‌గా ఈ సినిమా రవిచంద్రన్ దర్శకత్వంలో రీమేక్‌ చేశారు. ప్రస్తుతం ‘మేజర్‌‌’ సినిమా టైటిల్‌తో యంగ్‌ హీరో అడివి శేష్‌ సినిమా చేశాడు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్‌‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. జూన్‌ 3వ తేదీన తెలుగుతోపాటు మలయాళం,  హిందీ భాషల్లో విడుదల కాబోతున్న మేజర్‌‌ సినిమాకి శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు.

నాగార్జున మొదటి సినిమా విక్రమ్‌ టైటిల్‌ కమల్‌ హాసన్ చిత్రానికి

నాగార్జున తొలి సినిమా పేరు మరోసారి

1986లో ‘విక్రమ్‌’ అనే సినిమాతో నాగార్జున హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి సుమారు 35 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్‌‌ హీరోగా కొనసాగుతున్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత విక్రమ్‌ సినిమా టైటిల్‌తో మరో సినిమా రాబోతోంది. అయితే ఈ టైటిల్‌ పెట్టింది లోకనాయకుడు కమల్‌ హాసన్‌ 232వ సినిమాకి. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ‘విక్రమ్’ సినిమా జూన్‌3న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌‌ సినీ ప్రేమికులకు, కమల్‌ అభిమానులకు తెగ నచ్చేశాయి.

మలయాళం సినిమా జనగణమన టైటిల్.. పూరీ జగన్నాథ్‌ సినిమాకు

పూరి జగన్నాథ్‌ కలల ప్రాజెక్టుకు.. మలయాళీ సినిమా టైటిల్

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరోగా దర్శకుడు డిజో జోస్‌ ఆంటోనీ తీసిన మలయాళ సినిమా ‘జనగణమన’. ఈ ఏడాది ఏప్రిల్‌ 28న విడుదలైంది. ఇదే టైటిల్‌తో విజయ్‌ దేవరకొండ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా తెరకెక్కుతోంది. ‘జనగణమన’ టైటిల్‌తో సినిమా చేస్తానని, అది తన కలల ప్రాజెక్టు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ చాలాకాలం కిందటే ప్రకటించాడు. ఈ సినిమా కోసం ముందుగా ఓ స్టార్‌‌ హీరోను అనుకోగా, చివరకు ఆ అవకాశం విజయ్‌కు దక్కింది. 2023 ఆగస్టు 3న ‘జనగణమన’ సినిమా విడుదల చేయనున్నట్టు ముందుగానే ప్రకటించాడు పూరి.

పాత మహర్షి సినిమా టైటిల్‌తో మహేష్‌బాబు సినిమా

 ‘మహర్షి’ టైటిల్‌తో మరోసారి..

 ‘మహర్షి’ సినిమాలో హీరో ఎవరు అంటే ఠక్కున గుర్తు వచ్చే పేరు మహేష్‌బాబు. ఆ సినిమా అంత పెద్ద హిట్‌ అయ్యింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. అయితే మహర్షి సినిమా పేరుతో 1987లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో రాఘవ ప్రధాన పాత్ర పోషించాడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో రాఘవ ఇంటిపేరు మహర్షి అని మారేంతగా సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

కృష్ణంరాజు సినిమా టైటిల్‌తో శర్వానంద్‌ సినిమా

కృష్ణంరాజు, జగపతిబాబు టైటిల్‌తో.. శర్వానంద్‌

కృష్ణంరాజు హీరోగా 1981లో ‘ఆడవాళ్లూ! మీకు జోహార్లు’ పేరుతో సినిమా వచ్చింది. కె. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి గెస్ట్‌ రోల్‌ చేశాడు. తాజాగా యంగ్‌ హీరో శర్వానంద్‌,  రష్మికా మందాన హీరోహరోయిన్లుగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే టైటిల్‌తో సినిమా వచ్చింది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక, 1996లో జగపతిబాబు హీరోగా వచ్చిన ‘శ్రీకారం’ సినిమా టైటిల్‌తో శర్వానంద్, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంటగా బి.కిశోర్ దర్శకత్వంలో మరోసారి రిలీజ్ అయ్యింది.

మెగాస్టార్‌‌ గ్యాంగ్‌ లీడర్‌‌ టైటిల్‌తో నాని గ్యాంగ్‌ లీడర్

‘గ్యాంగ్‌ లీడర్’ టైటిల్‌తో నేచురల్‌ స్టార్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను తాజాగా నేచురల్‌ స్టార్‌‌ నాని హీరోగా తెరకెక్కింది. అయితే.. నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌‌ అని కొద్దిగా మార్పు చేశాడు దర్శకుడు విక్రమ్ కె కుమార్. ఇక, 1983లో కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబోలో వచ్చిన ఖైదీ సినిమా మెగాస్టార్‌‌ కెరీర్‌‌ గ్రాఫ్‌ను ఎంత పైకి తీసుకెళ్లిందనేది అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఖైదీ టైటిల్‌లో కార్తీ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో సినిమా వచ్చింది. 2019లో విడువలైన ఈ సినిమా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

మరిన్ని సినిమాలు..

ఎన్టీఆర్‌‌ నటించిన ​అడవి రాముడు సినిమాను ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్‌ సినిమాను విజయ్‌ సినిమాకు పెట్టుకోగా, రాక్షసుడు, దొంగ, గుణ, దేవదాసు, దేవుడు చేసిన మనుషులు, మిస్సమ్మ, అహ నా పెళ్లంట!, గణేష్‌, గీతాంజలి, ఘర్షణ, పిల్ల జమిందార్‌ టైటిల్స్‌తో రెండు సార్లు తెరకెక్కాయి.

చిరంజీవి టైటిల్‌ రాక్షసుడుతో శ్రీనివాస్‌ సినిమా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!