తప్పు చేయనంత వరకు భయపడబోం.. మాకు అండగా చిరంజీవి (Chiranjeevi) ఉన్నారన్న నిహారిక తల్లి పద్మజ

Updated on May 11, 2022 10:47 PM IST
చిరంజీవి (Chiranjeevi), నిహారిక, తల్లి పద్మజ
చిరంజీవి (Chiranjeevi), నిహారిక, తల్లి పద్మజ

తప్పు చేయనంత వరకూ తాము ఎవరికీ భయపడేది లేదని, తన కూతురు నిహారిక ఎలాంటిదో తెలుసునని నిహారిక తల్లి పద్మజ అన్నారు. నిహారిక ఎక్కడికి వెళ్లినా ధైర్యంగానే ఉంటానని, ఏదైనా జరిగితే చూసుకోవడానికి బావగారు చిరంజీవి (Chiranjeevi) ఉన్నారని అన్నారు పద్మజ. నిహారిక ఎప్పుడూ తప్పు చేయలేదని చెప్పారు. పబ్‌కు సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు చాలా బాధపడ్డామన్నారు పద్మజ.

చిరంజీవి మా అందరికీ ధైర్యం. ఆయన ఉన్నంత వరకు మాకు ఏమీ కాదు. హైదరాబాద్‌లోని ఒక పబ్‌లో పోలీసులు చేసిన రైడ్‌లో కొణిదెల నాగబాబు కూతురు నిహారిక పట్టుబడడం చర్చనీయాంశమైంది. పబ్‌లో జరుగుతున్న పార్టీలో డ్రగ్స్‌ వాడుతున్నారనే ఇన్ఫర్మేషన్‌తో పోలీసులు దాడి చేశారు. నిహారికను పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక, నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా అర్ద‌రాత్రి తెరుచుకొని ఉన్న ప‌బ్ లో ఆమె త‌న స్నేహితుల‌తో క‌లిసి డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు పుకార్లు వ‌చ్చాయి. ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి కూడా తీసుకొని ఆ త‌ర్వాత విడిచిపెట్టారు. ఇక‌, దీనిపై నాగ‌బాబు స్వ‌త‌హాగా త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ లో వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది. దీంతో పాటు భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌తో విడిపోయిన‌ట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. 
ఈ నేప‌థ్యంలో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నిహారిక తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. నిహారిక‌, చైత‌న్య క‌లిసి నిర్మించిన ప్రొడ‌క్ష‌న్ హౌస్ లో ఓ వెబ్ సిరీస్ కు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో వారిద్ద‌రూ క‌లిసి ఉండ‌టం విశేషం. దీంతో ఈ దంప‌తులిద్ద‌రూ విడిపోయిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌కు నిహారిక ఒక్క ఫోటోతో చెక్ పెట్టిన‌ట్లయింది.
ఇక‌, నిహారిక నిర్మిస్తున్న వెబ్ సిరీస్ విష‌యానికి వ‌స్తే.. జీ5 ఓటీటీ కోసం ఆమె ఓ కొత్త ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇందులో ప్రముఖ దర్శకుడు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేశ్‌, హీరోయిన్ స‌దా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మంగ‌ళవారం ఇందుకు సంబంధించిన ఓపెనింగ్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో నిహారిక భ‌ర్త‌తో పాటు, ఆమె త‌ల్లి, యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ‘హలో వరల్డ్ ‘పేరుతో రూపొంద‌నున్న ఈ వెబ్ సిరీస్ కు శివ సాయి వర్థన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నాడు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!