టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న నందమూరి చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna)

Updated on Jun 04, 2022 01:34 PM IST
Nandamuri Chaitanya Krishna:  నంద‌మూరి చైత‌న్య కృష్ణ సినిమా  ఫస్ట్ లుక్‌ను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న బాలకృష్ణ విడుదల చేశారు.
Nandamuri Chaitanya Krishna: నంద‌మూరి చైత‌న్య కృష్ణ సినిమా ఫస్ట్ లుక్‌ను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న బాలకృష్ణ విడుదల చేశారు.

Nandamuri Chaitanya Krishna: నంద‌మూరి ఫ్యామిలీ నుంచి మ‌రొక‌రు హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నంద‌మూరి చైత‌న్య కృష్ణ హీరోగా వెండితెర‌కి పరిచయం కానున్నారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జ‌య‌కృష్ణ కుమారుడు చైత‌న్య కృష్ణ‌. జ‌య‌కృష్ణ రీసెంట్‌గా బసవతారకరామ క్రియేషన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సొంత నిర్మాణ సంస్థ‌లో ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 1 గా తన కుమారుడితో సినిమా నిర్మిస్తున్నారు.  ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న బాలకృష్ణ విడుదల చేశారు.

 

Nandamuri Chaitanya Krishna:  నంద‌మూరి చైత‌న్య కృష్ణ సినిమా  ఫస్ట్ లుక్‌ను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న బాలకృష్ణ విడుదల చేశారు.

బసవతారకరామ క్రియేషన్స్ నుంచి తన కుమారుడిని కథానాయకుడిగా పరిచయం చేయ‌డం ఆనందంగా ఉందని జ‌య‌కృష్ణ అన్నారు. సరికొత్త కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నామ‌న్నారు. దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో చైత‌న్య కృష్ణ ఈ సినిమా చేస్తున్నార‌ని చెప్పారు. సినిమా పోస్ట‌ర్ చూస్తే థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెరకెక్కిస్తున్నట్లు అనిపిస్తుంది. త్వ‌ర‌లో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ అందిస్తామని నిర్మాతలు ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!