నా ఫస్ట్ ప్రయారిటీ తమిళానికే.. అలాగని హిందీని వ్యతిరేకించనంటున్న కమల్‌ హాసన్ (Kamal Haasan)

Updated on May 19, 2022 10:34 AM IST
కమల్‌ హాసన్ (Kamal Haasan) విక్రమ్‌ సినిమా పోస్టర్
కమల్‌ హాసన్ (Kamal Haasan) విక్రమ్‌ సినిమా పోస్టర్

‘హిందీని వ్యతిరేకించను. అలాగని నా మాతృభాష తమిళానికి అడ్డుపడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని’ కమల్‌హాసన్‌ చెప్పాడు. విక్రమ్‌ సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా కమల్‌ ఈ కామెంట్లు చేశాడు. సినిమా, రాజకీయాలు.. కవలపిల్లలు. తమిళం వర్థిల్లాలి అని చెప్పడం నా బాధ్యత. దీనికి ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొంటా. దీనికి, రాజకీయాలకు సంబంధం లేదు. మాతృభాషను మరువకండి. హిందీకి వ్యతిరేకినని చెప్పను. గుజరాతీ, చైనీస్‌ కూడా మాట్లాడండి. షూటింగ్‌ ఆఖరి దశలో హీరో సూర్య సహకరించారు. ఆయనకు ధన్యవాదాలు.

కమల్‌ నిర్మిస్తూ హీరోగా నటించిన చిత్రం ‘విక్రమ్‌’. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. ఫహద్‌, విజయ్‌సేతుపతి కీలకపాత్రల్లో నటించారు. లోకనాయకుడు కమల్‌ హాసన్ (Kamal Haasan) నటించిన కొత్త సినిమా ‘విక్రమ్’. కమల్‌ ఏ సినిమా చేస్తున్నా దానిపై సినీ ప్రేక్షకులకు, అభిమానులకు భారీ అంచనాలే ఉంటాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే కమల్‌ నటన కూడా ఉంటుంది. ఇక, విక్రమ్ సినిమా ట్రైలర్‌‌ ఆదివారం రిలీజైంది. భారీ తారాగణంతో తెరకెక్కిన విక్రమ్‌ సినిమా ట్రైలర్‌‌ యాక్షన్‌ థ్రిల్లర్‌‌లా ఉంది. ట్రైలర్‌‌తో సినిమాపై ఉన్న అంచనాలను డైరెక్టర్ మరింతగా పెంచేశాడనే చెప్పాలి.

ట్రైలర్‌‌ స్టార్టింగ్‌ నుంచి చివరి వరకు కమల్‌ డైలాగ్స్‌, యాక్టింగ్‌, విలన్లను పవర్‌‌ఫుల్‌గా చూపించడంతో సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి కలుగుతోంది. కమల్‌కు ధీటుగా విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌తోపాటు తోటి నటులు కూడా వారివారి పాత్రల్లో ఒదిగిపోయినట్టుగా అనిపిస్తోంది. కమల్‌ గురించి, ఆయన యాక్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఆయన ఏ పాత్ర చేసినా అందులో జీవిస్తారనే చెప్పాలి. ప్రతి సినిమాలోనూ వైవిద్యంగా కనిపించడానికి విభిన్నంగా నటించడానికే ఆరాటపడతారు.

ఏ పాత్ర చేసినా వైవిద్యం కోరుకునే నటుడాయన. కామెడీ, సీరియస్, సెంటిమెంట్‌ ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయి జీవించే నటుడిగా కమల్‌కు మంచి పేరుంది. అయితే ఇటీవల ఆయన చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. కథ, కథాంశం పరంగా అవి బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడుతున్నా.. ఆ సినిమాల్లో కూడా కమల్‌ నటనకు మంచి మార్కులే పడుతున్నాయి.

దశావతారం సినిమాలో పది పాత్రలు పోషించి మెప్పించిన కమల్.. విశ్వరూపం 1, 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా కమల్‌ చేస్తున్న సినిమా విక్రమ్. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కమల్‌ చేస్తున్న సినిమాపై ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అని ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు ఎదురుచూస్తారు అనడంలో ఏ సందేహం లేదు.

కమల్‌ హాసన్‌ సొంత నిర్మాణ సంస్ధ కమల్‌ ఇంటర్నేషనల్ ఫిలింస్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో ‘విక్రమ్‌’ సినిమాను నిర్మిస్తున్నాడు. లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్‌‌ విజయ్‌ సేతుపతి, మలయాళీ యాక్టర్‌‌ ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుథ్‌ మ్యూజిక్ చేస్తున్న కమల్‌ హాసన్ (Kamal Haasan) విక్రమ్‌ సినిమాను జూన్‌ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ‘మక్కల్‌ నీది మయ్యం’ పేరుతో రాజకీయ పార్టీ  స్థాపించిన కమల్‌.. 2019 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 37 స్థానాల్లో పోటీ చేసినా విజయం సాధించలేదు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!