మెగా ఫ్యామిలీ హీరోలతో మల్టీస్టారర్‌‌పై వరుణ్‌తేజ్ (Varun Tej) షాకింగ్ కామెంట్లు

Updated on May 26, 2022 06:40 PM IST
మెగాహీరోలతో వరుణ్‌తేజ్
మెగాహీరోలతో వరుణ్‌తేజ్

విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా ఎఫ్‌3. ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 27 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన కబుర్లు ఆయన మాటల్లోనే..

‘గని’ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఎఫ్‌3 కూడా రిలీజ్‌ అవుతుండడం ఆనందంగా ఉంది. ఎఫ్‌3 కోసం యూనిట్ అందరూ చాలా కష్టపడ్డారు. ఒక సినిమా హిట్‌ అవుతుందా లేదా అనే విషయాన్ని నిర్ణయించేది ప్రేక్షకులు మాత్రమే. ఎఫ్‌2 సినిమా తీస్తున్నప్పుడే ఎఫ్‌3 కూడా తీయాలని అనుకున్నాం. అయితే దాని పూర్తి బాధ్యతలను డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసుకున్నారు.

విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌తేజ్

కామెడీ చేయడం చాలా కష్టమని అర్థమైంది. ముందు నేను చెయ్యగలనా అని అనుకున్నాను. అయితే ప్రతి సన్నివేశాన్ని ఎలా నటించాలో అనిల్‌ దగ్గరుండి చెప్తారు. కొత్త కొత్త వాళ్లతో మాట్లాడాలంటే నాకు కొంచెం మొహమాటం. ‘ఎఫ్‌3’లో అందరూ అంతకుముందు చేసిన యాక్టర్స్‌ కావడంతో  ఇబ్బందిగా అనిపించలేదు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డబ్బునే ప్రేమిస్తారు. ‘ఎఫ్2’ చూడని వాళ్లు ఈ సినిమా చూసినా అర్థమవుతుంది. ఈ సినిమా చిన్న పిల్లలకు కూడా నచ్చుతుంది.

వెంకటేష్‌ అంటే నాకు చాలా ఇష్టం. రెండుసార్లు ఆయనతో కలిసి నటించినందుకు సంతోషంగా ఉంది. కాలేజీలో చదువుతన్నప్పటి నుంచే సునీల్‌ సినిమాలు చూసేవాడిని. నాకు ఇష్టమైన కమెడియన్‌ ఆయనే. సినిమాకు సంబంధించే కాకుండా వేరే విషయాలు కూడా దిల్‌రాజుతో మాట్లాడుతూ ఉంటాను. యూత్‌ సినిమాలకు ఒక్కొక్కరే వెళతారు. కానీ ఇలాంటి సినిమాలకు ఫ్యామిలీ అంతా కలిసి వస్తారు. ఇవి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌. అలా ఫ్యామిలీ అంతా వెళ్లాలంటే కొంతమందికి భారంగా ఉంటుంది. ఈ నిర్ణయం వాళ్లకి ఉపయోగపడుతుంది.

ఏ సినిమా ప్రత్యేకత దానికే ఉంటుంది. నేను చేసిన అన్ని సినిమాలూ ఇష్టమే. కొన్ని పాత్రలు చేయడం కష్టంగా, కొన్ని సులువుగా ఉంటాయి. ఏ సినిమా చేసినా పూర్తిగా న్యాయం చేస్తున్నానా లేదా అనేది మాత్రమే చూసుకుంటాను. కంచె సినిమాలో నేను చేసిన క్యారెక్టర్‌‌ ఇష్టం. ఓటీటీల్లో ఎక్కువ కంటెంట్‌ అందుబాటులో ఉండడంతో కథలను ఎంపిక చేసుకునే విధానంలో మార్పు వచ్చింది. అంతేకానీ అది పాన్‌ ఇండియా కారణంగా మాత్రం కాదు.  నాకు యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. అయితే అలాంటి సినిమాలే చేయాలని అనుకోవట్లేదు. అన్ని క్యారెక్టర్లు చేస్తాను. ముందే కథలు సిద్ధం చేసి పెట్టుకోవడం, వరుసగా చేయడం నచ్చదు. ఒక సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల ఆదరణను బట్టి తర్వాత సినిమా సెలెక్ట్‌ చేసుకుంటాను. ఇప్పటివరకు పాన్‌ ఇండియా కథలు పది విన్నాను.

ఎఫ్‌3 ట్రైలర్‌‌ను ఫ్యామిలీతో కలిసి చూశా. అది చూసి అందరూ షాక్‌ అయ్యారు. నువ్వేనా చేసింది అన్నారు. షూటింగ్స్‌కి వాళ్లు రాలేదు. నా మ్యానరిజం అందరికీ నచ్చింది. రాం చరణ్‌ అన్న ఫోన్‌ చేసి బాగుంది ఫన్నీగా ఉందని చెప్పాడు. మా నాన్న ఎంత అడిగితే అంతే డబ్బులు ఇస్తారు. కొన్ని రంగాల్లో వాళ్లకి డబ్బులు తేలికగా వస్తాయి అనుకుంటారు. కానీ కష్టపడకుండా వచ్చేది ఏదీ ఎక్కువ కాలం ఉండదు. డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టాలి. మెగా ఫ్యామిలీలో మల్టీస్టార్‌‌ చేయాలనే ఉంటుంది. అన్నీ కుదరాలి. ఇంట్లో సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకోం. కేవలం కుటుంబపరమైన అంశాలే మాట్లాడుకుంటాం అని చెప్పాడు వరుణ్‌ తేజ్ (Varun Tej). 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!