కోవై సరళ (Kovai Sarala) : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన లేడీ కమెడియన్ .. ‘సెంబి’ సినిమా ఫస్ట్‌ లుక్ వైరల్ !

Updated on May 22, 2022 10:42 PM IST
సెంబి సినిమాలో కోవై సరళ ఫస్ట్‌ లుక్
సెంబి సినిమాలో కోవై సరళ ఫస్ట్‌ లుక్

సినిమాలో కామెడీ చేసి నవ్వించే వాళ్లలో మగవాళ్లు చాలా మందే ఉన్నా.. పక్కా కామెడీ చేసే లేడీ కమెడియన్లు తక్కువనే చెప్పుకోవాలి. వారిలో కూడా కోవై సరళ (Kovai Sarala) స్పెషల్‌. దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాల్లోనూ కామెడీ చేసిన ఆమె.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. చివరగా 2019వ సంవత్సరంలో వచ్చిన అభినేత్రి 2 సినిమా తర్వాత, కోవై సరళ వెండితెరకు కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలు ఈ ఫోటోలో ఉన్నది కోవై సరళా? కాదా? అని సినీ అభిమానులు అనుమానపడుతున్నారు. అంత గుర్తుపట్టలేనంతగా ఉంది ఆమె.  ఈ ఫోటోలో తలపై క్లాత్‌ కప్పుకుని, వృద్ధురాలిగా దీన స్థితిలో ఉన్నట్టు కోవై సరళ కనిపిస్తోంది.  ఆ ఫోటో చూసిన వాళ్లు షాకవుతున్నారు. అసలు కోవై సరళకు ఏమైంది? అని కొందరు బాధపడుతూ, సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే  అసలు విషయం తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అదంతా ఒక సినిమా కోసం కోవై సరళ వేసిన వేషం.

ఎప్పుడూ తెరపై నవ్వుతూ, నవ్విస్తూ ఉండే కోవై సరళ, ఈ ఫోటోలో మాత్రం చాలా సీరియస్‌గా కనిపించింది. ఈ స్టిల్ ఆమె తాజాగా నటించిన తమిళ చిత్రం ‘సెంబి’ లోనిది. ‘అరణ్య’ ఫేమ్ ప్రభు సోలోమాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, కోవై సరళ వృద్దురాలిగా నటిస్తోంది. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని, ఆమె ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం రిలీజ్‌ చేశారు.

 ఓ బస్సులో 24 మంది ప్రయాణికుల చుట్టూ ఈ కథ నడుస్తుందని, ఇందులో కోవై సరళ (Kovai Sarala) ఓ సీరియస్ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. తంబి రామ‌య్య, అశ్విన్ కుమార్‌తోపాటు చైల్డ్ ఆర్టిస్ట్ నీల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని తమిళంలో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!