యశ్‌ (Yash) హీరోగా వచ్చిన కేజీఎఫ్‌2 సినిమాకి సీక్వెల్‌ షూటింగ్‌ నవంబర్‌‌ నుంచి.. అదేం లేదని క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

Updated on May 15, 2022 08:33 PM IST
కేజీఎఫ్‌3 పోస్టర్
కేజీఎఫ్‌3 పోస్టర్

యశ్‌ (Yash) హీరోగా వచ్చిన కేజీఎఫ్‌, దానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్‌2 ఎంతటి ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్‌2 సినిమా చివరిలో దానికి సీక్వెల్‌గా కేజీఎఫ్‌ చాప్టర్‌‌ 3 ఉండనుందని చిత్ర యూనిట్‌ చిన్న హింట్‌ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం దానిపై నిర్మాణ సంస్థ, దర్శకుడు, హీరో నుంచి ఎటువంటి అప్‌డేట్‌ రానప్పటికీ.. నెట్టింట్లో మాత్రం తాజాగా దానిపై కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కేజీఎఫ్‌ సినిమాలో ప్రేక్షకులకు మిగిల్చిన ప్రశ్నలకు కేజీఎఫ్‌2 సినిమాలో దర్శకుడు క్లారీటి ఇచ్చాడు. ఇక, కేజీఎఫ్‌2లో మూడు సంవత్సరాలు సినిమా హీరో ఫారిన్‌లో ఏం చేశాడనేది ప్రశ్నగానే మిగిలింది. దానిపై కేజీఎఫ్‌3లో క్లారిటీ వచ్చే చాన్స్‌ ఉంది. ప్రస్తుతం కేజీఎఫ్‌3 స్క్రిప్ట్ వర్క్‌ జరుగుతోందని, ఈ ఏడాది నవంబర్‌‌ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభించే చాన్స్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నీ నిర్మాత విజయ్‌ కిరగందూర్ చెప్పినట్టు ఆయా వార్తల్లో రాసుకొచ్చారు.

అయితే, ఆ వార్తలపై నిర్మాత విజయ్‌ మాత్రం స్పందించలేదు. దాంతో ఆ వార్తలు నిజమేనని చాలా మంది ఫిక్స్ అవుతున్నారు. ఇక, కేజీఎఫ్‌3 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఈ ఏడాది నవంబర్‌‌ నుంచి రెగ్యులర్‌‌ షూటింగ్‌ జరగనున్నట్టు వచ్చిన వార్తలను హోంబలే సంస్థకు చెందిన మరో నిర్మాత కార్తీక గౌడ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నెట్టింట్లో వైరల్‌ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. ప్రస్తుతానికి మా చేతిలో మంచి మంచి సినిమాలు ఉన్నాయి. మా దృష్టంతా వాటిపైనే ఉంది. కేజీఎఫ్‌3 సినిమాను ఇప్పుడిప్పుడే పట్టాలెక్కించే ఆలోచన హోంబలే సంస్థకు లేదు. కేజీఎఫ్‌3 షూటింగ్‌ ప్రారంభిస్తే అధికారికంగా ప్రకటన చేస్తాం’ అని కార్తీక్‌ ట్వీట్ చేశాడు.

కాగా, యశ్‌ (Yash) హీరోగా నటించిన  కేజీఎఫ్‌2 పాన్‌ ఇండియా సినిమాగా రిలీజై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేజీఎఫ్‌ పార్ట్‌1కు వచ్చిన క్రేజ్‌ను వినియోగించుకుంటూ మొదటిరోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కేజీఎఫ్‌2కి సీక్వెల్‌గా కేజీఎఫ్‌3 తీస్తారో లేదో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!