Vikram (విక్రమ్) : లోకనాయకుడి సినిమా రైట్స్ సొంతం చేసుకున్న.. నితిన్ నిర్మాణ సంస్థ !

Updated on May 22, 2022 06:18 PM IST
కమల్‌ హాసన్ విక్రమ్‌ సినిమా పోస్టర్
కమల్‌ హాసన్ విక్రమ్‌ సినిమా పోస్టర్

సినీ ప్రేమికులు ఎప్పటినుంచో  ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'విక్రమ్'.  కమల్‌ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అభిమానులు ఈ సినిమాపై చాలా ఉత్సుకతతో ఉన్నారు . విజయ్‌తో 'మాస్టర్‌‌' సినిమా తీసి హిట్‌ కొట్టిన లోకేష్‌ కనగరాజ్‌.. 'విక్రమ్' సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం.

పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. టాలీవుడ్‌ యువ హీరో నితిన్ (Nithin) ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు.. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇదే క్రమంలో ‘విక్రమ్’  సినిమా తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్నాడు.

నితిన్‌ ట్వీట్

శ్రేష్ఠ్‌ మూవీస్‌ పేరుతో నితిన్‌ సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పాడు. ఈ సంస్థలో సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు 'విక్రమ్‌' సినిమా తెలుగు రైట్స్‌ను శ్రేష్ఠ మూవీస్‌ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నితిన్‌ ట్విట్టర్‌‌ వేదికగా వెల్లడించాడు.

ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది.  ఈ ట్రైలర్‌‌లో కమల్‌ యాక్షన్‌తోపాటు, ఫోటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీగా ఉండడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

అరవై ఏళ్లు దాటినా, యువ హీరోలకు దీటుగా ఈ సినిమాలో కమల్‌ యాక్షన్‌ సీన్స్ చేశారని టాక్. ఇక ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలలో కనిపించనున్నారు. కమల్‌ హాసన్‌ 232వ సినిమా 'విక్రమ్'. 

కమల్ హాసన్ తన సొంత బ్యానర్‌‌ 'రాజ్‌కమల్‌ ఫిలింస్' పై, మిత్రుడు ఆర్‌‌.మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాను తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. బిగ్గెస్ట్‌ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన 'విక్రమ్' సినిమా జూన్‌3 న విడుదల కాబోతోంది. కాగా, ఈ సినిమా తెలుగు రైట్స్‌ను హీరో నితిన్ (Nithin)కు చెందిన శ్రేష్ఠ్‌ మూవీస్‌ సొంతం చేసుకుంది.


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!