కమెడియన్లు జబర్దస్త్‌ మహేష్‌ (Mahesh), సుదర్శన్‌ ప్రధాన పాత్రధారులుగా ‘నటరత్నాలు’ సినిమా

Updated on May 16, 2022 04:30 PM IST
జబర్దస్త్‌ మహేష్‌ (Mahesh), సుదర్శన్‌
జబర్దస్త్‌ మహేష్‌ (Mahesh), సుదర్శన్‌

జబర్దస్త్​ కామెడీ షోలో ఎంట్రీ ఇచ్చి నవ్వులు పూయించిన మహేష్, పలు సినిమాల్లో కామెడీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుదర్శన్.. వీరితోపాటు ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన అర్జున్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నటరత్నాలు’. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ ప్రస్తుతం జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో పూజా కార్యక్రమం జరగనుంది. గాదె నాగభూషణం దర్శకత్వంలో రాబోతున్న నటరత్నాలు సినిమాను ఎవరెస్ట్‌ ఎంటర్‌‌టైన్మెంట్స్‌ బ్యానర్‌‌పై ఎన్‌.ఎస్‌.నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు.

మహేష్, సుదర్శన్, అర్జున్‌తోపాటు భద్రం, శేషాద్రి కీలకపాత్రల్లో నటిస్తున్న  నటరత్నాలు సినిమా క్రైమ్‌ మిస్టరీగా తెరకెక్కనుంది. మిస్టరీతోపాటుగా ఈ సినిమాలో కామెడీ కూడా హైలైట్‌గా నిలిచేలా సినిమా తెరకెక్కించనున్నట్టు సమాచారం. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చిత్ర యూనిట్‌ తెలిపింది.

జబర్దస్త్‌ కామెడీ షోలో పేరు తెచ్చుకుని సినిమాల్లో చాన్స్‌ కొట్టేసిన మహేష్.. తరువాత పలు సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. రంగస్థలం సినిమాలో వేసిన పాత్రకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో 1990వ సంవత్సరంలో పుట్టిన మహేష్‌ .. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!