యశోద (Yashoda) పాత్ర సమంతకు(Samantha) కలిసొస్తుందా?

Updated on May 01, 2022 06:31 PM IST
Source: Twitter
Source: Twitter

అది ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా. అందులో నటి సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. ఓ విభిన్నమైన పాత్రలో దర్శనమివ్వడానికి శాయశక్తులా కష్టపడుతోంది. కఠినమైన శిక్షణను కూడా తీసుకుంటోంది. ఆ పాత్ర పేరే 'యశోద'. సినిమా పేరు కూడా అదే. యశోద అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేవారు ఎవరు? శ్రీ కృష్ణుడిని అల్లారుముద్దుగా పెంచిన తల్లి. కాకపోతే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాకు, యశోద పాత్రకు సంబంధమేమిటి? అన్నదే ఇక్కడ మన సందేహం. బహుశా, ఇది పురాణాలతో సంబంధం లేని, కల్పిత పాత్ర కూడా కావచ్చు. 

ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలతో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి  ఒక కల్పిత కథను అల్లి RRR అనే సినిమా తీశాడు. మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ సూపర్ హిట్ కొట్టాడు. 

ఇప్పుడు అదేబాటలో యువ దర్శకులు కూడా పయనిస్తున్నారేమో అని మనకు అనిపించకమానదు. కానీ 'యశోద' సినిమా కొంచెం డిఫరెంట్. 

ఈ సినిమాయే ఓ ప్రయోగం

దీనికి దర్శకత్వం వహిస్తోంది తెలుగు దర్శకుడు కాదు. తమిళంలో ప్రయోగాత్మక సినిమాలు తీసే హరిశంకర్, హరి నారాయణ్ అనే ఇద్దరు యువకులు.  వీరు గతంలో అంబులి, జంబులింగ్, ఆహ్ లాంటి తమిళ చిత్రాలు తీశారు. 

మరో సర్‌ప్రైజ్

అలాగే ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నవారు ప్రముఖ చలనచిత్ర విశ్లేషకులు పులగం చిన్నారాయణ మరియు చల్లా భాగ్యలక్ష్మి. చల్లా భాగ్యలక్ష్మి గారు గతంలో టీవీ 9 ఎంటర్‌టైన్‌మెంట్ విభాగానికి హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 

నిర్మాత తెగింపు

ఆదిత్య 369 సినిమాను మించిన సైన్ ఫిక్షన్ సినిమా.. తెలుగులో మళ్లీ రాలేదనే చెబుతారు ఎవరైనా. అలాంటి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన శివలెంక క్రిష్ణప్రసాద్ ఈ  సినిమాకూ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

హీరో ఈజ్ ఫ్రమ్ కేరళ

తన కెరీర్‌లో ఎన్నో మలయాళ చిత్రాలలో నటించి, టాలీవుడ్‌ పరిశ్రమకు జనతా గ్యారేజ్ చిత్రం ద్వారా పరిచయమైన ఉన్ని ముకుందన్ ఈ చిత్రంలో గౌతమ్ అనే పాత్రను పోషిస్తున్నారని సమాచారం. అలాగే ఈ చిత్రంలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ప్రధానమైన పాత్ర పోషించనున్నారు. 

అన్ని భాషలలో

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. 

హాలీవుడ్ స్థాయి స్టంట్స్

హాలీవుడ్ స్టంట్స్ మ్యాన్ యానిక్ బెన్, ఈ చిత్రం కోసం నటి సమంతకు ప్రత్యేకంగా కొన్ని స్టంట్స్‌లో ట్రైనింగ్ యిస్తున్నారు. 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!