మంచు విష్ణుతో స్టెప్పులేయిస్తున్న ఇండియన్ మైకేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా (Prabhu Deva)

Updated on May 05, 2022 03:45 PM IST
ప్రభుదేవా (Prabhu Deva), మంచు విష్ణు, పాయల్‌ రాజ్‌పుత్
ప్రభుదేవా (Prabhu Deva), మంచు విష్ణు, పాయల్‌ రాజ్‌పుత్

కొంతకాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నాడు హీరో మంచు విష్ణు. తెలుగుతోపాటు ఇంగ్లీష్‌లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేసిన మోసగాళ్లు సినిమా కూడా విష్ణుకి బిగ్‌ బ్రేక్ ఇవ్వలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని కసిగా ఉన్నాడు. ప్రస్తుతం గాలి నాగేశ్వరరావు అనే సినిమా చేస్తున్నాడు విష్ణు. ఈ సినిమాలో విష్ణుకి జంటగా పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తోంది.

ఇక, ఈ సినిమాతోనైనా గెలుపు గాలి తనవైపు మళ్లుతుందని ఆశతో ఉన్నాడు విష్ణు. సినిమా షూటింగ్‌ను కూడా చాలా స్పీడ్‌గా కంప్లీట్‌ చేస్తున్నాడు. గాలి నాగేశ్వరరావు సినిమాలోని ఒక కీలకపాత్రలో సన్నీలియోన్‌ నటిస్తోంది. ఇషాన్‌ సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న గాలి నాగేశ్వరరావు సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో శరవేగంగా జరుగుతోంది.

విష్ణు, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న గాలి నాగేశ్వరరావు సినిమాలోని ఒక పాటకు ఇండియన్‌ మైకేల్ జాక్సన్‌ ప్రభుదేవా (Prabhu Deva) కొరియోగ్రఫీ చేస్తున్నాడు. చాలాకాలం తర్వాత ప్రభుదేవా తెలుగు సినిమాలోని పాటకు కొరియోగ్రఫీ చేస్తుండడంతో ఆ పాటపై అంచనాలు ఎక్కువయ్యాయి. కోన వెంకట్‌ కథ అందించి గాలి నాగేశ్వరరావు సినిమాకి అనూప్‌ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

తెలుగులో చాలా కాలం నుంచి ప్రభుదేవా సినిమాలు చేయడం లేదు. చాలాకాలం పాటు కొరియోగ్రాఫర్‌‌గా నటుడిగా ఉన్న ఆయన కొన్నాళ్ల క్రితం దర్శకుడిగా మారారు. తెలుగులోనూ పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడిగా బాలీవుడ్‌కు వెళ్లారు. అక్కడే సినిమాలు చేస్తూ బిజీ కావడంతో టాలీవుడ్‌కు ఆయన కొంత దూరమయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్‌ఫాదర్‌‌ సినిమాలో ఒక పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ పాటలో చిరంజీవితోపాటు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ కూడా ప్రభుదేవా (Prabhu Deva) కొరియోగ్రఫీలో స్టెప్స్‌ వేయనున్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!