మంచి స్క్రిప్ట్‌ వస్తే సినిమాను నిర్మిస్తా.. గార్గి సినిమా ప్రమోషన్స్‌లో హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi)

Updated on Jul 12, 2022 06:24 PM IST
సాయి పల్లవి (Sai Pallavi) ప్రస్తుతం గార్గి సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు.
సాయి పల్లవి (Sai Pallavi) ప్రస్తుతం గార్గి సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు.

తన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi). ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. లేడీ పవర్‌‌స్టార్‌‌గా కూడా పేరు తెచ్చుకున్నారు సాయిపల్లవి.

తన క్యారెక్టర్‌‌లో ఏదో ఒక కొత్తదనం, ఫ్రెష్‌నెస్ ఉంటేనే సినిమాను అంగీకరించే పల్లవి.. తన నటనతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తారు.  అందుకే తెలుగుతోపాటు తమిళ సినిమాల్లోని మంచి మంచి క్యారెక్టర్లు ఆమె కోసమే రాసినట్టుగా ఉంటున్నాయి.

సాయి పల్లవి తాజాగా ‘విరాటపర్వం’ సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితేనేం ఆ సినిమాలోని సాయి పల్లవి నటనకు సినీ ప్రేక్షకులు, విమర్శకులు ఫిదా అయ్యారు. విరాట పర్వం సినిమాలో ఆమె నటనకు మరిన్ని మంచి మార్కులు పడ్డాయనే చెప్పుకోవాలి.  

ప్రస్తుతం ‘గార్గి’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు సాయిపల్లవి (Sai Pallavi). ఈ నెల 15న తమిళంతో పాటు పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ‘గార్గి’ సినిమా మొత్తం సాయి పల్లవి క్యారెక్టర్‌‌ చుట్టూనే తిరుగుతుంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన గార్గి సినిమా ప్రమోషన్‌ పనుల్లో సాయి పల్లవి ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు.

జ్యోతిక, సూర్య, సాయి పల్లవి (Sai Pallavi)

గార్గి సినిమాను ప్రెజెంట్‌ చేస్తున్న స్టార్ హీరో జంట

తమిళ స్టార్ హీరో సూర్య దంపతులకు గార్గి సినిమా తమిళ వెర్షన్‌ను చూపించారు సాయి పల్లవి. సినిమా నచ్చడంతో తమిళంలో ‘గార్గి’ని సూర్య – జ్యోతిక జంట ప్రెజెంట్ చేస్తున్నారు. ‘గార్గి’ సినిమాను ప్రమోట్ చేయడానికి ఉదయనిధి స్టాలిన్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు సాయిపల్లవి. తెలుగులో అయితే గార్గి సినిమా ప్రమోషన్స్‌ను దగ్గుబాటి రానా నిర్వహిస్తున్నారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సాయి పల్లవి మాట్లాడుతూ… ‘గార్గి సినిమాకు సమర్పకురాలిగా నా పేరు వేస్తామని నిర్మాతలు చెప్పారు. అయితే దానికి నేను అంగీకరించలేదు. నా సినిమాకు నేను సమర్పకురాలు ఏంటి? మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు సినిమాను నేనే నిర్మించి పూర్తిస్థాయి నిర్మాతగా మారతా’ అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చారు. హీరోయిన్లు నిర్మాతలుగా మారడం ఇటీవల కామన్ అయిపోయింది. త్వరలోనే సాయి పల్లవి (Sai Pallavi)  కూడా నిర్మాతగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Read More : పుష్ప2 సినిమాకు అల్లు అర్జున్ (Allu Arjun) ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటే? వైరల్ అవుతున్న న్యూస్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!