బీటౌన్ కల్చర్ నాకు పెద్దగా నచ్చదు.. కాస్మొటిక్ సర్జరీలపై హీరోయిన్ రాధికా ఆప్టే (Radhika Apte) కామెంట్స్
క్యారెక్టర్ నచ్చితే ఎటువంటి పాత్ర చేయడానికైనా రెడీగా ఉంటుంది హీరోయిన్ రాధికా ఆప్టే (Radhika Apte). విభిన్న పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్‌గా నటించడానికి కూడా వెనుకాడలేదు ఈ బ్యూటీ. బాలకృష్ణతో లయన్, లెజెండ్ సినిమాల్లో నటించిన తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది రాధిక. హిందీలో ప్యాడ్ మ్యాన్, అంధాధున్, బద్లాపూర్, గౌల్, సాక్రెడ్ గేమ్స్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఫారెన్సిక్, విక్రమ్ వేదా సినిమాల్లో నటిస్తోంది.
ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో హీరోయిన్ల కాస్మొటిక్ సర్జరీలపై రాధిక సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకున్నవారే. అవకాశాలు, పాపులారిటీని పెంచుకునేందుకు ముఖం, శరీరానికి సర్జరీలు చేసుకున్న హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. చాలామంది సర్జరీలు చేయించుకొని వయసు కనిపించకుండా పోరాడుతున్నారు. ముఖాన్ని, శరీరాన్ని మార్చుకోవడానికి చాలామంది సహ నటీనటులు కాస్మొటిక్ సర్జరీలు చేయించుకున్నారు. అదంతా నా వల్ల కాదు. శరీరాకృతిని పట్టించుకోవద్దు అంటూనే సర్జరీలు చేయించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిని చూసి విసిగిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది రాధిక.
హీరోయిన్స్‌పై రాధిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. తనకు బీ-టౌన్ పార్టీలు, కల్చర్ పెద్దగా ఇష్టం ఉండదని చెప్పింది. ‘వృత్తిపరంగా మాత్రమే సినీరంగంతో కలిసి ఉంటాను. పర్సనల్‌గా మాత్రం ఆ కల్చర్‌లో కలవలేను. కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకోవడం, తమ గొప్పతనాన్ని ఇతరుల ముందు ప్రదర్శించే ధోరణి పరిశ్రమలో ఎక్కువగా ఉంటుంది. నా వ్యక్తిత్వానికి అవన్నీ సరిపడవు. అందుకే షూటింగ్ ముగించుకున్న వెంటనే ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటా. సినీ ప్రపంచాన్ని మర్చిపోయి నాకు నచ్చిన పనులు చేసుకుంటూ ఖాళీగా ఉన్న సమయాన్ని ఆస్వాదిస్తా’ అని రాధిక (Radhika Apte) చెప్పింది.