నా గురించి నీకెంత తెలుసు అంటున్న నాని (Nani), నజ్రియా .. అట్రాక్ట్‌ చేసేలా ‘అంటే సుందరానికీ’ ప్రమోషన్స్

Updated on May 26, 2022 04:35 PM IST
నజ్రియా, నాని
నజ్రియా, నాని

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘అంటే సుందరానికీ’. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్‌, టీజర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ‘అంటే సుందరానికీ’ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సినిమాలో నాని సుందరం పాత్రలో, నజ్రియా లీలా థామస్ క్యారెక్టర్‌‌ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అంటే సుందరానికీ’ సినిమా జూన్ 10వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌ను కొత్తగా చేస్తోంది చిత్ర యూనిట్. థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే విధంగా సినిమాపై ఇంట్రెస్ట్‌ కలిగేలా పబ్లిసిటీపై శ్రద్ధ తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. చిన్న సినిమాలతో పాటు.. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా చిత్రాలు సైతం కొత్త రకంగా ప్రమోషన్లు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ‘అంటే సుందరానికీ’ సినిమాలో సుందరం క్యారెక్టర్‌‌ చేసిన నాని  కూడా ప్రమోషనల్లో కొత్త దారిని ఎంచుకున్నాడు.

స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆరాటపడుతూ ఉంటారు. వారికి ఇష్టమైన వంటకాల నుంచి ఇష్టమైన ప్రదేశాల వరకు ప్రతీదీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే దారిని సెలెక్ట్‌ చేసుకున్నాడు నాని. ‘అంటే సుందరానికీ’ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ నజ్రియాతో కలిసి ఫన్నీగా చిట్ చాట్ చేశాడు. ఈ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

నాని(Nani), నజ్రియా ఒకరి గురించి ఒకరికి ఎంత బాగా తెలుసు అనే విషయంపై పరీక్ష పెట్టుకున్నారు. తాము వినియోగించే యాప్, ఇష్టమైన సినిమాలు, నచ్చే ప్రదేశాల గురించి ప్రశ్నలు వేసుకున్నారు. ఈ ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ‘అంటే సుందరానికీ’ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించాడు.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!