అభిమానులతో కలిసి మహేష్ సర్కారు వారి పాట సినిమా చూసిన సాయి పల్లవి (Sai Pallavi).. కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్

Updated on May 16, 2022 08:29 PM IST
సాయి పల్లవి (Sai Pallavi)
సాయి పల్లవి (Sai Pallavi)

ఫిదా సినిమాతో తెలుగు మ‌న‌సు దోచేసింది సాయిప‌ల్లవి ( Sai Pallavi) .  డ్యాన్స్‌, యాక్టింగ్‌తో తోటి నటులకు సవాల్‌ విసురుతోందీ ఈ కోలీవుడ్‌ బ్యూటీ. ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపిస్తున్న సాయిపల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్‌ చాలా ఎక్కువ. అయితే ఎంత స్టార్ డ‌మ్ వ‌చ్చినా సింఫుల్ ఉండడానికే ఈ భామ ఇష్టపడుతుంది. త‌నకిష్టమైన హీరోల సినిమాల‌ను సాధార‌ణంగా థియేట‌ర్లకు వెళ్లి చూడాల‌నుకుంటుంది. అయితే ప్రతిసారీ అది సాధ్యం కాకపోవచ్చు. ఈసారి మాత్రం తాను అనుకున్నట్టుగానే సింపుల్‌గా సినిమాకు వెళ్లింది సాయిప‌ల్లవి. ఇంత‌కీ ఈ నేచురల్ బ్యూటీ వెళ్లిన సినిమా ఏంటంటే.. మ‌హేశ్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట.

బంజారాహిల్స్​లోని పీవీఎక్స్ ఆర్‌కే ప్లెక్స్ లో సినిమా చూసింది. అయితే త‌న‌ను ఎవ‌రూ గుర్తు ప‌ట్టకుండా ముఖాన్ని క‌వ‌ర్ చేసుకుని, త‌ల‌కు స్కార్ఫ్ కట్టుకుని, మాస్క్ పెట్టుకుని, హ్యాండ్‌బ్యాగ్ వేసుకొని థియేట‌ర్‌కు వెళ్లింది. త‌న‌ను ఎవ‌రూ గుర్తుపట్టలేదనుకుంటుండ‌గానే..ఒక వ్యక్తి మాత్రం సాయిప‌ల్లవిని గుర్తుపట్టి ఫోటో తీశాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్‌ చేస్తోంది. త‌మ ఫేవ‌రేట్ హీరో మ‌హేశ్ బాబు సినిమాను అంద‌రిలా థియేట‌ర్‌కు వ‌చ్చి..సినిమాను ఎంజాయ్ చేసిన సాయిప‌ల్లవిని చూసి ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు.

కాగా,  దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటనా నటించిన సినిమా విరాట పర్వం. సినిమా షూటింగ్ పూర్తయ్యి  దాదాపుగా సంవత్సరం గడుస్తున్నా.. ఇప్పటికీ విడుదల కాలేదు. క‌రోనా త‌ర్వాత పెద్ద హీరోల సినిమాల‌తో థియేట‌ర్లు బ్లాక్ అయ్యాయి.  దీంతో విరాట ప‌ర్వం రిలీజ్ లేట్ అయింది. ప్రస్తుతం థియేటర్లు ఖాళీ అవుతుండడం.. సర్కారు వారి పాట సినిమా తర్వాత పెద్ద సినిమాలు లేకపోవడంతో ఎట్టకేలకు విరాట పర్వం సినిమాను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. జూలై 1న విరాట ప‌ర్వం సినిమాను విడుద‌ల చేయనున్నట్టు తెలిపింది. ఈ లేటెస్ట్ అప్‌డేట్‌ సాయి ప‌ల్లవి అభిమానుల‌కు గుడ్ న్యూస్‌ అనే చెప్పాలి.

కామ్రెడ్ ర‌వ‌న్నగా రానా న‌టిస్తున్నారు. భారతక్కగా ప్రియమణి యాక్ట్ చేస్తున్నారు. రవన్న రచనలకు ఫిదా అయ్యి అతడి కోసం అడవికి వెళుతుంది సాయిప‌ల్లవి. అస‌లు రానాను క‌లుస్తుందా లేదా.. ఆమెకు ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!