రవితేజ(Ravi Teja)కు లిప్​ లాక్​ లు అచ్చిరావంటున్న అభిమానులు!

Updated on May 09, 2022 07:50 PM IST
రవితేజ(Ravi Teja)కు లిప్​ లాక్​ సీన్‌
రవితేజ(Ravi Teja)కు లిప్​ లాక్​ సీన్‌

మాస్​ మహారాజ్​ ర‌వితేజ(Ravi Teja)  నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్​ డ్యూటీ. ఈ సినిమాలో హీరోయిన్​ గా దివ్యాంక కౌశిక్​ నటిస్తోంది. మరో పాత్రలో రాజీషా విజ‌య‌న్ న‌టిస్తోంది. కాగా ఈ సినిమా నుంచి సొట్ట బుగ్గ అనే పాట‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు సామ్ సీఎస్ కంపోజ్ చేసిన ఈ పాట అద్బుతంగా ఉంద‌ని కితాబిస్తున్నారు. అయితే ఇందులో ర‌వితేజ‌, దివ్యాంశ కౌశిక్‌ల మ‌ధ్య కెమిస్ట్రీ ఒక రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా ర‌వితేజ హీరోయిన్‌కు లిప్‌లాక్ ఇచ్చే సీన్‌ను ఇందులో చూపించారు. దీంతో ర‌వితేజ ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు.గ‌తంలో ర‌వితేజ న‌టించిన కిక్ 2 సినిమాలో ర‌కుల్ ప్రీత్‌కు, త‌రువాత ప‌వ‌ర్ సినిమాలో రెజీనాకు లిప్‌లాక్ ఇచ్చారు. వాటిలో కిక్ 2 అట్ట‌ర్ ఫ్లాప్ కాగా.. ప‌వ‌ర్ యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక త‌రువాత ఈ మ‌ధ్యే వ‌చ్చిన ఖిలాడి మూవీలో డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిల‌కు కూడా ర‌వితేజ లిప్‌లాక్ ఇచ్చారు. ఇక తాజాగా రామారావు ఆన్‌డ్యూటీలోనూ ఇదే ప‌రంప‌ర‌ను కొన‌సాగించారు. దీంతో ఫ్యాన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.ర‌వితేజ‌కు లిప్‌లాక్‌లు అచ్చిరావ‌ని.. క‌నుక ఆయ‌న అలాంటి ప‌నులు చేయ‌వ‌ద్ద‌ని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే శృతి హాస‌న్‌తో క‌లిసి చేసిన క్రాక్ సినిమా అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది. అందులో ఎలాంటి లిప్‌లాక్ సీన్లు లేవు. క‌నుక ఆ సీన్లు చేయ‌వ‌ద్ద‌ని.. అవి అచ్చి రావ‌డం లేద‌ని.. అవి లేకుండా సినిమాలు చేస్తే హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ అంటున్నారు. మ‌రి వారి విజ్ఞ‌ప్తిని ర‌వితేజ ప‌రిగ‌ణించి ఆచ‌ర‌ణ‌లో పెడ‌తారా.. లేదా.. అన్న‌ది చూడాలి. ఇక రామారావు ఆన్ డ్యూటీ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుండ‌గా.. దీంతోపాటు ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు మూవీలోనూ న‌టిస్తున్నారు. స్టూవ‌ర్ట్‌పురంలో పేరుగాంచిన గ‌జ‌దొంగ జీవిత‌గాథ ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. 
 ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.యదార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, సర్పట్ట జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ కనిపించనున్నారు. రామారావు ఆన్ డ్యూటీ జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన టైగర్ నాగేశ్వరరావు అనే ఓ పాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి రవితేజ  (Ravi Teja) లుక్‌ను విడుదల చేసింది టీమ్. ఈ సినిమా కోసం రవితేజ లుక్ మాత్రం ఊహించని రేంజ్‌లో ఉందని చెప్పాలి. రవితేజ 71వ చిత్రంగా వస్తున్న టైగర్ కోసం రవితేజ సిక్స్ ప్యాక్ బాడీలో రాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. నుపుర్ సనన్ విషయానికొస్తే.. ఈమె ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు. మరో హీరోయిన్‌గా గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. ఇక  ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయానికొస్తే.. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవారు. అందుకే ఆయనకు ప్రజల్లో ఎంతో పేరుండేది. ఈయన్ని బ్రిటిష్ వారు పట్టుకొని ఉరి తీశారు. ఓ రకంగా ఉన్నవాళ్లను దోచుకొని .. బీద సాదలకు పెట్టడం ఈయన్ని అందరు ముందుగా ‘టైగర్ నాగేశ్వరరావు’ అని పిలిచేవారు. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!