ఎఫ్3(F3) సినిమాలోని పార్టీ సాంగ్ అవుట్

Updated on May 17, 2022 07:15 PM IST
లైఫ్ అంటే ఇట్లా ఉండాలా పాట‌ను ఎఫ్3(F3) టీం రిలీజ్ చేసింది
లైఫ్ అంటే ఇట్లా ఉండాలా పాట‌ను ఎఫ్3(F3) టీం రిలీజ్ చేసింది

లైఫ్ అంటే ఇట్లా ఉండాలా పాట‌ను ఎఫ్3(F3) టీం రిలీజ్ చేసింది. పూజ హెగ్డే(Poojahegde), వెంక‌టేష్, వ‌రుణ్ క‌లిసి ఈ పాట‌లో సంద‌డి చేశారు. ఎఫ్3 సినిమాలో పార్టీ సాంగ్‌గా ఈ పాట‌ పాపుల‌ర్ అయింది .

అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్3 సినిమా త‌ర్వ‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ్రీన్‌లు ఎఫ్2కు మించి ఎఫ్3లో ఎంట‌ర్‌ట్రైన్ చేయ‌నున్నారు. సోనాల్ చౌహాన్ ఓ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయితే.. ఎఫ్‌3 (F3) మూవీకి పూజ హెగ్డే సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్‌గా చేశారు అనిల్ రావిపూడి.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పార్టీ సాంగ్‌ను కంపోజ్ చేశారు. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్, పూజ హెగ్డే పార్టీ సాంగ్‌లో లైఫ్ అంటే ఇట్లా ఉండాలా అంటూ అద‌ర‌గొట్టారు. ఎఫ్3 సినిమాలో ఈ పాట స్పెష‌ల్ కానుంది. లిరికల్ వీడియోను విడుదల చేయడానికి ముందు పోస్టర్, ప్రోమోలను విడుదల చేశారు. స్పెష‌ల్ పార్టీ సాంగ్‌పై ఆస‌క్తి పెంచారు. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ ఎఫ్‌3 సినిమాను నిర్మిస్తుంది. ఫ్యామిలీ అండ్ ఫ‌న్ ఎంట‌ర్‌ట్రైన్ సినిమాగా ఎఫ్3 ఉండ‌బోతుంది. నిర్మాత‌ దిల్ రాజు స‌మ‌ర్ఫ‌ణ‌లో శిరీష్ నిర్మించారు. ప్రేక్షకులకు ఫ‌న్ ఇచ్చేందుకు మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!