మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) తో సినిమా చేయనున్న డైరెక్టర్ సంపత్ నంది?

Updated on May 08, 2022 07:53 PM IST
సాయి ధరమ్‌ తేజ్‌(Sai Dharam Tej), సంపత్‌ నంది
సాయి ధరమ్‌ తేజ్‌(Sai Dharam Tej), సంపత్‌ నంది

"ఏమైంది ఈవేళ" సినిమాతో టాలీవుడ్​లో గుర్తింపు తెచ్చుకున్న  డైరెక్టర్  సంపత్ నంది. ఆ సినిమా విజయం తర్వాత "రచ్చ", "బెంగాల్ టైగర్", "గౌతమ్ నంద" వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. గోపీచంద్ హీరోగా "సిటీ మార్" సినిమా తో ప్రేక్షకులను పలకరించిన సంపత్ నంది ఇప్పుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఒక ప్రముఖ ప్రొడక్షన్ ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వచ్చి బంపర్​ హిట్​ కొట్టిన విక్రమార్కుడు సీక్వెల్​గా రూపొందుతున్న ‘విక్రమార్కుడు–2’ షూటింగ్​లో బిజీగా ఉన్న సంపత్​ నంది త్వరలోనే సాయి ధరమ్​తో తీయబోయే సినిమానూ పట్టాలెక్కించనున్నారట. చాలాకాలంగా  ఓ మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీ చేయాలనుకుంటున్న సాయిధరమ్ తేజ్ కు ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరబోనుంది. అంతేకాదు ఓ టాప్ సీనియర్ హీరోకి కూడా సంపత్ నంది కథ చెప్పినట్టు సమాచారం.

సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు దండు కార్తిక్ దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు.  యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ నటిస్తున్న సినిమా ఇది. ఈమధ్యనే షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ జరుగుతుండగానే.. సంపత్ నంది చిత్రంలో కూడా సాయిధరమ్ తేజ్ నటిస్తాడని తెలుస్తోంది. సంపత్ లో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ..  ఇప్పటి వరకూ అతడి కథలకు సరైన హీరోలు దొరక్క అతడి ప్రాజెక్ట్స్ లేటవుతున్నాయనేది ప్రేక్షకుల అభిప్రాయం.

యాక్షన్ చిత్రాలు తీయడంలో తనదైన మార్కు చూపించే సంపత్ నంది సాయిధరమ్ (Sai Dharam Tej)​ని ఏ యాంగిల్​లో చూపిస్తాడో చూడాలి. మెగాహీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్​కి ముందే నటించిన "రిపబ్లిక్"  సినిమా విడుదలై మంచి టాక్​ తెచ్చుకుంది.  అన్ని విభాగాల్లో విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ సినిమా  బాక్సాఫీస్ వద్ద మాత్రం యావరేజ్ కలెక్షన్లు నమోదు చేసుకుంది. యాక్సిడెంట్ తరువాత చాలా రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న సాయి ధరమ్​తేజ్ ఈమధ్యనే మళ్లీ షూటింగుల్లో పాల్గొంటున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!