‘కరణ్‌ అర్జున్’ : అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదలైన కొత్త సిన్మా ట్రైలర్ !

Updated on May 22, 2022 05:09 PM IST
‘కరణ్‌ అర్జున్’ మూవీ ట్రైలర్  రిలీజ్ చేస్తున్న అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)
‘కరణ్‌ అర్జున్’ మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తున్న అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)

అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా ‘క‌ర‌ణ్ అర్జున్‌’. మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమా ట్రైలర్‌ గురువారం విడుదలైంది. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)  కరణ్‌ అర్జున్‌ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

"క‌ర‌ణ్ అర్జున్‌’ సినిమా ట్రైల‌ర్ బాగుంది. విజువ‌ల్స్ కూడా బాగున్నాయి.  ఒక యంగ్ టీమ్ చాలా రిస్క్‌ తీసుకుని.. పాకిస్థాన్ బార్డర్‌లో షూటింగ్ చేశారు. ట్రైల‌ర్ లాగే సినిమా కూడా బాగుంటుంద‌ని అనుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌" అని అనిల్ రావిపూడి తెలిపారు.

‘ఎఫ్ 3 సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నా.. కరణ్ అర్జున్ సినిమా ట్రైలర్‌‌ రిలీజ్‌ చేయడానికి ఒప్పుకున్న అనిల్‌ రావిపూడి గారికి థ్యాంక్స్. మూడు పాత్రలతో రోడ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. పాకిస్థాన్ బార్డర్‌లో రిస్క్ చేసి షూటింగ్ చేశాం. ఎవరి ఊహలకూ అందని విధంగా, సినిమాలో ప్రతి సన్నివేశం ఉంటుంది. థియేట‌ర్‌కు వచ్చిన ఆడియ‌న్స్‌ తప్పకుండా, మా సినిమాని ఎంజాయ్ చేస్తారు. కంటెంట్‌ని న‌మ్ముకుని ఈ సినిమా చేశామని" డైరెక్టర్ మోహ‌న్ శ్రీవ‌త్స తెలిపారు

రెడ్ రోడ్ థ్రిల్లర్స్ ప‌తాకంపై సోమేశ్వరరావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల నిర్మించిన ఈ సినిమాకు రోషన్‌ సాలూరి సంగీతం అందించారు.కాగా, అనిల్‌ రావిపూడి డైరెక్షన్ చేసిన తాజా సినిమా ఎఫ్‌3. ఈ సినిమా కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎఫ్‌3 సినిమా ప్రమోషన్స్‌లో వెంకీ, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్‌తోపాటు డైరెక్టర్‌‌ అనిల్ రావిపూడి కూడా బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక, సూపర్‌‌హిట్‌ సినిమా ఎఫ్‌ 2 కి సీక్వెల్‌గా ఎఫ్‌3 సినిమాను తెరకెక్కించాడు అనిల్ (Anil Ravipudi) . దీనికి కొనసాగింపుగా ఎఫ్‌4 కూడా ఉంటుందని సినిమా ప్రమోషన్స్‌లో  హింట్ ఇచ్చాడీ క్రేజీ డైరెక్టర్.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్‌‌ హిట్‌ కొట్టిన తర్వాత.. అనిల్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం.. ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా వచ్చిన ఎఫ్‌ 2 కి సీక్వెల్‌ కావడంతో ఎఫ్‌ 3 పై భారీ అంచనాలే ఉన్నాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!