ఎఫ్ 2 కు సీక్వెల్‌గా ఎఫ్‌ 3 ఉన్నట్టే.. ఎఫ్‌ 4 కూడా కచ్చితంగా ఉంటుంది: అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)

Updated on May 22, 2022 02:28 PM IST
అనిల్‌ రావిపూడి  (Anil Ravipudi)
అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)

"పటాస్" సినిమాతో డైరెక్టర్‌‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) తక్కువ సినిమాలతోనే స్టార్ డైరెక్టర్‌‌గా పేరు సంపాదించుకున్నాడు. డైలాగ్‌, స్క్రీన్‌ప్లే రైటర్‌‌గా పలు సినిమాలకు పనిచేసిన అనిల్.. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో ఎక్స్‌పర్ట్‌ అనే చెప్పాలి. కల్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన "పటాస్‌" సినిమాకు డైరెక్షన్‌ చేసిన అనిల్, సినిమాలో కామెడీతోపాటు యాక్షన్ సీన్స్‌ను కూడా కొత్తగా తీసి, బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌ అందుకున్నాడు.

ఎఫ్‌ 2 కి సీక్వెల్‌గా అనిల్‌ రావిపూడి తీసిన ఎఫ్‌ 3 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అనిల్‌ మాట్లాడాడు. ఈ కార్యక్రమంలో పలు విషయాలను మీడియాతో పంచుకున్నాడు అనిల్. విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ కలిసి నటించిన 'ఎఫ్‌ 3' సినిమాకి కూడా సీక్వెల్‌ ఉంటుందా..? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అనిల్‌ అవుననే సమాధానమిచ్చాడు. 'ఎఫ్‌ 4' కూడా ఉంటుందని చెప్పాడు. 'నవ్వించటమే మన పని కాబట్టి కచ్చితంగా ఎఫ్‌ 4 ఉంటుందని' అన్నాడు అనిల్.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు, శిరీష్ 'ఎఫ్‌ 3' సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో హీరోయిన్లుగా తమన్నా, మెహరీన్‌ నటించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న, ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్  ఇప్పటికే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి.

ఇక, "పటాస్" సినిమా తర్వాత సాయిధరమ్‌ తేజ్, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ‘సుప్రీం’,...  రవితేజ ఫుల్‌ లెంగ్త్‌ బ్లైండ్‌ క్యారెక్టర్‌‌ చేసిన ‘రాజా ది గ్రేట్’,... వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కామెడీ మ్యాజిక్ ఎఫ్‌ 2.. సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు, రష్మికా మందాన హీరోహీరోయిన్లుగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి సినిమాలకు డైరెక్షన్‌ చేశాడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi). అంతకుముందు శంఖం, హ్యాపీహ్యాపీగా, మిస్టర్ పర్‌‌ఫెక్ట్‌, దరువు, మసాలా సినిమాలకు రైటర్‌‌గా పనిచేశాడు. కందిరీగ, ఆగడు, గాలి సంపత్‌ సినిమాలకు స్క్రీన్‌ప్లే కూడా అందించాడు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!