‘చీకటి గదిలో’ హీరోయిన్‌కు బాలకృష్ణ (Nandamuri BalaKrishna) సిన్మాలో ఛాన్స్.. ఎగిరి గంతేస్తున్న ఇండో ఆస్ట్రేలియన్ భామ !

Updated on May 22, 2022 01:59 PM IST
బాలకృష్ణ, చంద్రికా రవి
బాలకృష్ణ, చంద్రికా రవి

నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna) - గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతోంది. NBK 107 వర్కింగ్‌ టైటిల్‌తో  ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఇండో ఆస్ట్రేలియన్‌ భామ, ‘చీకటి గదిలో..’ ఫేమ్‌ చంద్రికా రవి నటించనున్నట్టు తెలుస్తోంది.

జరిగిన కథ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలోని, ఓ స్పెషల్‌ సాంగ్‌లో చంద్రిక ఆడిపాడనుందని సమాచారం. ఈ పాట కోసం ముందుగా డింపుల్‌ హయాతిని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ చంద్రికను ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. NBK107లో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందంటూ, చంద్రిక తాజాగా ఓ సోషల్ మీడియా పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ హైదరాబాద్‌ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ‌లో ఈ పాట తెరకెక్కనుంది. 

ఇక, రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న షూటింగ్‌ సెట్‌లో బాలయ్య, గోపీచంద్‌లతో దిగిన ఫొటోని.. తమన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక, ఇటీవలే బాలయ్య నటించిన 'అఖండ' సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే సినిమా ఏంటనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌ను.. ‘అన్నగారు’ అనే పేరుతో ఫిక్స్‌ చేసినట్టు సమాచారం. బాలయ్య కూడా పూర్తి మాస్ సినిమా చేయాలని అనుకుంటున్నారని, దాంతో అటువంటి కథలపైనే ఆయన ఫోకస్‌ పెరిగినట్టు తెలుస్తోంది.

బాలకృష్ణతో మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్న కథతో సినిమా చేయనున్నట్టు, ఇటీవలే  గోపీచంద్‌ కూడా ప్రకటించారు. అప్పటినుంచి బాలయ్యను, దర్శకుడు గోపీచంద్‌ ఎలా చూపిస్తారో తెలుసుకొనేందుకు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇక ఈ సినిమాలో బాల‌కృష్ణ (Nandamuri BalaKrishna) క్యారెక్ట‌ర్ ఆధారంగానే 'అన్నగారు' అనే టైటిల్ పెట్టార‌ని అంటున్నారు. ఈ చిత్రంలో ఓ విభిన్న‌మైన పాత్ర‌లో బాల‌కృష్ణ క‌నిపించనున్నట్టు టాక్. ఈ చిత్రంలో డ‌బుల్ రోల్‌లో బాలకృష్ణ యాక్ట్ చేయనున్నార‌ని కూడా వార్తలు వస్తున్నాయి. అందులో ఒక‌టి ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ ఉన్న క్యారెక్టర్‌‌ కాగా.. మరొకటి బిజినెస్‌మ్యాన్‌ క్యారెక్టర్ అని సమాచారం. చాలాకాలం తర్వాత నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌‌లో కూడా బాలకృష్ణ  నటించనున్నారని, ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను, త్వరలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తోంది చిత్ర యూనిట్.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!