వెరైటీ కాన్సెప్ట్‌తో బ్రహ్మాజీ (Brahmaji) కొడుకు హీరోగా 'స్లమ్‌డాగ్ హస్బెండ్' సినిమా.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్
'ఓ పిట్టకథ' సినిమాతో కొడుకు సంజయ్ రావుని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నటుడు బ్రహ్మాజీ (Brahmaji). రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆ సినిమా.. ట్విస్టుల మీద ట్విస్టులతో ఆడియన్స్‌ను అలరించింది. తాజాగా సంజయ్ రావు హీరోగా మరో సినిమా రాబోతుంది. 'స్లమ్‌డాగ్ హస్బెండ్' అనే వెరైటీ టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు ఏఆర్ శ్రీధర్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు.
సంజయ్ రావు పుట్టినరోజు సందర్భంగా 'స్లమ్‌డాగ్ హస్బెండ్' మూవీ మోషన్ పోస్టర్‌ను హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. ప్రణవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను అక్కిరెడ్డి, వెంకట్ అన్నపు రెడ్డి నిర్మిస్తున్నారు.
ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా సినిమా పోస్టర్ చూస్తే అనిపిస్తోంది. సరికొత్త కాన్సెప్ట్‌తో డైరెక్టర్ ఏఆర్ శ్రీధర్ సినిమా తీస్తున్నాడని అర్థమవుతోంది. కొన్ని మూఢనమ్మకాలను బేస్ చేసుకుని.. వాటిని వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించాడట. మూఢనమ్మకాలతో వివాహాలు ఎలా జరుగుతున్నాయనే కాన్సెప్ట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరికి జంతువులతో పెళ్లి అయిన క్లిప్పింగ్స్‌ను, రాశుల ఫోటోలతో మోషన్ పోస్టర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్. అంతేకాకుండా చివరిలో విజయ్ దేవరకొండ మాదిరిగా 'ఎవడ్రా నా కుక్కపై రంగుపోసింది' అంటూ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
కాగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బ్రహ్మాజీ చాలా పాపులర్. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన దాదాపు అందరి హీరోలతోనూ నటించాడు. విలన్‌గానే కాకుండా సీరియస్‌గా ఉంటూనే కామెడీ పండించే క్యారెక్టర్లు చేసిన బ్రహ్మాజీ (Brahmaji).. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.