Bramhastram: 'బ‌హ్మాస్త్రం' పాట‌ను తెలుగులో పాడిన అలియా భట్(Alia Bhatt) .. ఎన్టీఆర్‌ను ప్ర‌శంసించిన‌ ఆలియా 

Updated on Sep 03, 2022 03:40 PM IST
Bramhastram: ‘బ్రహ్మస్త్రం’ చిత్రంలోని కుంకుమలా అనే పాటను అలియా (Alia Bhatt) తెలుగులో పాడారు.
Bramhastram: ‘బ్రహ్మస్త్రం’ చిత్రంలోని కుంకుమలా అనే పాటను అలియా (Alia Bhatt) తెలుగులో పాడారు.

Bramhastram: పాన్ ఇండియా సినిమా 'బ్ర‌హ్మాస్త్రం' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. సెప్టెంబ‌ర్ 9న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. హైద‌ర‌బాద్‌లో 'బ్ర‌హ్మాస్తం' చిత్ర యూనిట్ మీడియా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ స‌మావేశంలో అలియా భ‌ట్ (Alia Bhatt) 'బ్ర‌హ్మాస్త్రం' సినిమాలో పాట‌ను తెలుగులో పాడారు. ఆ వీడియోను మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అలియా పాడిన పాట ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఎన్టీఆర్ చాలా గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న హీరో అంటూ అలియా అన్నారు.

ఎన్టీఆర్, రాజ‌మౌళిలు గొప్ప వ్య‌క్తులు - అలియా

'బ్ర‌హ్మాస్త్రం' (Brahmastra)  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేక‌ర్స్ హైద‌రాబాద్‌లో చేయాల‌ని అనుకున్నారు. ఈ ఈవెంట్‌ ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌ను ఆహ్మానించారు. వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల కార‌ణంగా పోలీసుల బందోబ‌స్తు ఇవ్వ‌క‌పోవ‌డంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ర‌ద్దు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మీడియా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సమావేశంలో అలియా భ‌ట్ ఎన్టీఆర్‌ను ప్ర‌శంసించారు. 

ఎన్టీఆర్‌ను అంద‌రూ గొప్ప హీరో అంటుటార‌ని.. ఎన్టీఆర్ గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి కూడా అని అలియా అభిప్రాయ‌ప‌డ్డారు. రాజ‌మౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్'లో హీరోయిన్‌గా సెలెక్ట్ అవ‌డం త‌న అదృష్ట‌మ‌న్నారు. 'బ్ర‌హ్మాస్త్రం' సినిమాకు హీరో రాజ‌మౌళి అంటూ అలియా ఎమోష‌న‌ల్ అయ్యారు. 

తెలుగు పాట‌ను ఆల‌పించిన హీరోయిన్

‘బ్రహ్మస్త్రం’ చిత్రంలోని కుంకుమలా అనే పాటను అలియా (Alia Bhatt) తెలుగులో పాడారు. అలియా భ‌ట్ పాట‌కు క‌ర‌ణ్, రాజ‌మౌళి, ర‌ణ్‌బీర్ ఆనందించారు. అలియా కూడా కుంకుమ‌లా పాట‌ను చాలా చ‌క్క‌గా ఆల‌పించారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియా భ‌ట్ జంట‌గా నటించారు. అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్ కీలక పాత్రలు పోషించారు. 

Read More : Brahmastra: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ర‌ద్దుపై అభిమానుల‌ను క్ష‌మాప‌ణలు కోరిన‌ ఎన్టీఆర్ (NTR)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!