ఎఫ్‌4పై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi).. మరో స్టార్‌‌ హీరోతోనూ కామెడీ చేయిస్తానంటున్న యంగ్ డైరెక్టర్

Updated on May 26, 2022 02:12 PM IST
వరుణ్‌ తేజ్, రాజేంద్రప్రసాద్, అనిల్‌ రావిపూడి, వెంకటేష్
వరుణ్‌ తేజ్, రాజేంద్రప్రసాద్, అనిల్‌ రావిపూడి, వెంకటేష్

విక్టరీ వెంకటేష్‌, మెగా‌ప్రిన్స్ వరుణ్ తేజ్‌ హీరోలుగా తెరకెక్కిన వినోదాత్మక చిత్రం ‘ఎఫ్ 3’. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘ఎఫ్ 2’కి ఇది సీక్వెల్. ఎఫ్‌2లో ఉన్న క్యారెక్టర్లనే కంటిన్యూ చేస్తూ వేరే కథతో ఈ సినిమా రూపొందించానని చెబుతున్నాడు అనిల్. హీరోయిన్లుగా తమన్నా, మెహ్రీన్ నటించారు. సునీల్, మురళీ శర్మతో పాటు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ ఎఫ్‌3 సినిమాలో కీలకపాత్రలు పోషించారు. ఎఫ్‌2ని మించి హిలేరియస్ కామెడీని ఈ భాగంలో వర్కవుట్ చేసినట్టు మేకర్స్ చెబుతున్నారు. ఈ నెల 27న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. ‘సమ్మర్ సోగ్గాళ్లు’ ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు అనిల్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. 

ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యాలో అనిల్ రావిపూడి మాట్లాడాడు. ఈ సందర్భంగా ఎఫ్‌3 తర్వాత ‘ఎఫ్ 4’  సినిమా కూడా ఉంటుందని వెల్లడించాడు. అయితే ఎఫ్‌4 గురించి అనిల్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చాడు. ఎఫ్‌4లో మరోస్టార్‌‌ హీరో కూడా యాక్ట్‌ చేస్తాడని చెప్పాడు. ‘ఎఫ్ 3’ లో మరో స్టార్ హీరోని అనుకున్నామని, అయితే అప్పటికే ఇందులో కావల్సినంత ఫన్ వచ్చేసిందని, అందుకే ఆ అవసరం రాలేదని అన్నాడు. ‘ఎఫ్ 4’ సినిమాలో కచ్చితంగా మరో స్టార్ హీరో నటిస్తాడని స్పష్టం చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. దీంతో మూడో భాగంపై ఆసక్తిని మరింత పెంచేశాడు. మూడో భాగంలో మరో హీరోగా ఎవరిని సెలెక్ట్‌ చేస్తారనే విషయంపై చర్చ మొదలైంది.

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నిర్మించిన ఈ సినిమాకి ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. రెండున్నగర గంటలకు పైగానే నాన్‌స్టాప్‌గా సినిమా తెరపై నవ్వులు పూయించబోతోంది. కాగా, ‘ఎఫ్ 3’ చిత్రంపై ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ నడుస్తోంది. డబ్బు చుట్టూ తిరిగే కథ.. రేచీకటితో బాధపడే పాత్రలో వెంకీ, నత్తితో ఇబ్బందిపడే యువకుడిగా వరుణ్ హిలేరియస్ కామెడీ పండించబోతున్నారని అనిల్ రావిపూడి (Anil Ravipudi) చెబుతున్నాడు. ఈ రెండు పాత్రలతో తెరపై కావల్సినంత వినోదం వర్కవుట్ అయిందని.. సినిమా అయిపోయిన తర్వాత కూడా ప్రేక్షకులు నవ్వుతునే ఉంటారని మేకర్స్ చెబుతున్నారు. కరోనా మూడో వేవ్ తర్వాత ఈ తరహా ఫన్ మూవీ టాలీవుడ్‌లో రాలేదు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద  నవ్వులు పూయిస్తుందని ఇండస్ట్రీ టాక్.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!