సందీప్ కిషన్ ‘మైఖేల్‌’ సినిమాలో కీలక పాత్ర చేయనున్న యాంకర్‌‌ అనసూయ (Anasuya Bharadwaj)

Updated on May 16, 2022 07:30 PM IST
సందీప్ కిషన్ ‘మైఖేల్‌’ సినిమా పోస్టర్,  యాంకర్‌‌ అనసూయ (Anasuya Bharadwaj)
సందీప్ కిషన్ ‘మైఖేల్‌’ సినిమా పోస్టర్, యాంకర్‌‌ అనసూయ (Anasuya Bharadwaj)

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌ కామెడీ షోలో యాంకర్‌‌గా పాపులర్ అయిన అనసూయ..తన అందంతో సినిమాల్లోనూ అభిమానులను అలరిస్తోంది. రాంచరణ్‌ – సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా, అల్లు అర్జున్‌ పుష్ప పార్ట్‌–1లో సునీల్‌కు భార్యగా నటించి మంచి పేరు సంపాదించుకుంది ఈ బుల్లి తెర యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).

ఒకవైపు యాంకర్‌‌గా చేస్తూనే పలు సినిమాల్లో కీలకపాత్రల్లో, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లోనూ నటిస్తోంది అనసూయ. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘మైఖేల్‌’ సినిమాలో కీలకపాత్ర కోసం అనసూయను ఎంపిక చేసినట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. రంజిత్ జెయకోడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్‌గా చేస్తోంది.

'మైఖేల్' లో విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).  కూడా కీలక పాత్రలో కనిపించనుందని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో పాన్‌ ఇండియా సినిమాగా మైఖేల్‌ విడుదల కానుంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సినిమాను నిర్మిస్తోంది.

సందీప్ కిషన్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇటీవల సందీప్ చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక గల్లీ రౌడీ మూవీ తరువాత సందీప్ కిషన్ చేస్తున్న మూవీ ‘మైఖేల్’. కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు సందీప్‌ కిషన్. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సిక్స్ ప్యాక్ బాడీతో సందీప్ పోస్టర్‌‌లో కనిపించాడు. ఈ సినిమాలో పలువురు స్టార్ యాక్టర్స్ పనిచేస్తుండటంతో మైఖేల్ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీగా అంచనాలు పెరిగిపోయాయి.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!