ఆట డ్యాన్స్‌ షో విన్నర్ మృతి.. లిక్కర్‌‌ ఎక్కువకావడం వలనే టీనా సాధు (Tina Master) మరణించిందని అనుమానాలు

Updated on May 13, 2022 09:07 PM IST
ఆట విన్నర్‌‌ టీనా సాధు (Tina Master)
ఆట విన్నర్‌‌ టీనా సాధు (Tina Master)

డ్యాన్స్‌ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్‌ విన్నర్‌ టీనా సాధు (Tina Master) మరణించింది. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న టీనా ఇటీవల డ్యాన్స్‌ షోల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టీనా మరణవార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చిన్నవయసులోనే టీనా మరణించడంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆట మొదటి సీజన్‌కు విన్నర్‌ అయిన టీనా అదే షో నాలుగో సీజన్‌కు జడ్జిగా వ్యవహరించింది. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా గోవాలో రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడే ఉంటోంది.

సుమారుగా నాలుగుఐదు రోజుల క్రితం హైదరాబాద్‌కు టీనా వచ్చిందని సమాచారం, ఈ క్రమంలో యాంకర్‌‌ శిల్పా చక్రవర్తిని కలిసి డ్యాన్స్‌ షోల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్టు ఆమెతో చెప్పిందని తెలుస్తోంది. అనంతరం టీనా గోవా వెళ్లిపోయింది. గోవాలోని తన ఇంట్లో మద్యం సేవించిందని, మందు ఎక్కువ మోతాదులో తాగినందు వలన గుండెపోటు వచ్చినట్టు సమాచారం. టీనా కుటుంబసభ్యులు కూడా దాదాపుగా ఇదే చెబుతున్న వార్త ప్రస్తుతం వైరల్‌ అయ్యింది.

టీనా మరణించిన తర్వాత ఆమె చివరిసారి సోషల్‌ మీడియాలో షేర్‌‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. గోవా బీచ్‌లో ఆనందంగా గడుపుతూ తీసిన వీడియోను టీనా (Tina Master) చివరిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌‌ చేసింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!