బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop): టాప్5 లో ఉండే ఫైన‌ల్ లిస్ట్ ఇదేనా?

Updated on May 11, 2022 09:53 AM IST
బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఫైన‌ల్ లిస్ట్ (BiggBoss Final List)
బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఫైన‌ల్ లిస్ట్ (BiggBoss Final List)

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటిటి లో బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) సీజన్ 1 ప్రసారమవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ షో 10 వారాలు పూర్తి చేసుకుంది. గ‌త వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఆశు రెడ్డి ఎలిమినేట్ అయ్యింది. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బాబా భాస్కర్, నటరాజ్ మాస్టర్, అరియానా గ్లోరీ, బిందు మాధవి, మిత్రశర్మ, యాంక‌ర్ శివ, అఖిల్, అనిల్ కొనసాగుతున్నారు. కాగా, ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలేకు చేరువలో ఉంది. ఇక‌, షో మ‌ధ్య‌లోకి వ‌చ్చాక‌ 8వ వారం లో బాబా భాస్కర్ మాస్టర్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఖ‌చ్చితంగా టాప్5 కి వెళ్తామనుకున్న హౌస్ మేట్స్ అంచనాలు తారుమారయ్యాయి. టాప్ 5 లో ఉంటామని ఆశపడిన వారు సైతం ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు.

కాగా, ప్రస్తుతం హౌజ్ లో ఉన్న వాళ్ళల్లో బిందు (Bindu Madhavi), బాబా భాస్కర్, మిత్రా శ‌ర్మ‌, అఖిల్, యాంక‌ర్ శివ టాప్ 5 లో ఉండి ఫినాలేకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ వారం డేంజర్ జోన్ లో నటరాజ్ మాస్టర్, అనిల్, అరియానా  ఉన్నట్లు అన‌ధికార ఓట్ల ఆధారంగా సమాచారం అందుతోంది. నిజానికి మిత్రా శ‌ర్మ‌ డేంజర్ జోన్ లో ఉండాల్సింది. అయితే, తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుండంతో ఆమె కూడా టాప్ 5 వెళ్ళే ఛాన్స్ ఉంది. 

ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో టాప్ 5 కాకుండా టాప్ 6 ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బాబా భాస్కర్ మాస్టర్ ఒక‌వేళ ఈ వారం ఎలిమినేష‌న్ కాక‌పోతే త‌న‌ వద్ద ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి నటరాజ్ మాస్టర్ ని సేవ్ చేయ‌వ‌చ్చు. అలా  చేస్తే ఆయన కూడా ఫినాలేకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే, ఒక‌వేళ‌ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ (Double Elimination) జరిగితే అనిల్, అరియానా ఇద్ద‌రూ కచ్చితంగా ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ‌త‌ సీజన్ లో టాప్ 5 వరకు వెళ్లిన అరియానా ఈ సీజన్లో మాత్రం టాప్ 5 లో స్థానం దక్కించుకోక‌పోవచ్చ‌ని ప్రేక్షకులు జోస్యం చెబుతున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!