Priyanka Singh: పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ సీజన్ 5 (Biggboss Season 5) బ్యూటీ ప్రియాంక సింగ్..?

Updated on Aug 26, 2022 08:22 PM IST
ప్రియాంక సింగ్‌ (Priyanka Singh) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రియాంక సింగ్‌ (Priyanka Singh) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఫేమ్ ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ కి (Priyanka Singh) సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు మంచి తెచ్చుకుంది ప్రియాంక. ఆ తర్వాత బిగ్‌బాస్‌ సీజన్‌5లో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. 

ప్రియాంక అసలు పేరు సాయి తేజ. ఈమె లేడీ గెటప్ అని అందరూ అనుకున్నారు. కానీ తాను సర్జరీ చేయించుకుని ట్రాన్స్ జెండర్ గా మారానని గతంలో తెలిపింది. ఈ విషయం గురించి తన తండ్రికి తెలియదంటూ బిగ్ బాస్ వేదికపై తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

కాగా, బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక.. మరో కంటెస్టెంట్ మానస్ తో (Maanas Nagulapalli) బాగానే రొమాన్స్ చేసింది. ఆ సీజన్ లో మరింత వెరైటీగా ట్రాన్స్ జెండర్ తో కూడా లవ్ ట్రాక్ నడిపారు బిగ్ బాస్ నిర్వాహకులు. హౌస్ లో అడుగుపెట్టిన నాటి నుండి ఎలిమినేట్ అయ్యే వరకు.. ఓపెన్ గా లవర్స్ అని చెప్పుకోనప్పటికీ, అంతకు మించి అన్యోన్యంగా ఈ జంట హౌస్ లో మెలిగారు. తిట్టినా, కొట్టినా, విసిగించుకున్నా… ప్రియాంక.. మానస్ ని వదిలేది కాదు.

ఇదిలా ఉంటే.. ప్రియాంక సింగ్‌ (Priyanka Singh) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ.. కొన్ని రోజుల కిందట ఆమె తన తల్లిదండ్రులతో కలిసి పూజా చేస్తూ ఓ ఫోటోను కూడా షేర్‌ చేసింది. దీనికి 'ఇట్స్‌ డన్‌' అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. 

తాజాగా హల్దీ ఫంక్షన్‌లోనూ (Priyanka Singh Haldi Function) తళుక్కుమంది. ఎల్లో కలర్‌ లెహంగాలో పెళ్లికూతిరిలా ముస్తాబైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  

అయితే.. ప్రియాంక వీటిని ఫోటోషూట్ (Priyanka Singh Photoshoot) లాగా తీయించుకుందో లేక త్వరలో పెళ్లి చేసుకోనుందో అన్న విషయంలో క్లారిటీ లేదు.. కానీ ప్రస్తుతం ఆ ఫోటోలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలో ఈ బ్యూటీ చాలా అందంగా ఉంది.

Read More: Chalaki Chanti: బిగ్ బాస్ సీజన్ 6 (Biggboss Season 6) లో ఎంట్రీపై జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి స్పందన ఇదే..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!