BiggBoss Nonstop: బిగ్ బాస్ నాన్ స్టాప్ లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ క‌థ ముగిసింది!

Updated on May 16, 2022 04:06 PM IST
న‌ట‌రాజ్ మాస్ట‌ర్ (Natraj Master)
న‌ట‌రాజ్ మాస్ట‌ర్ (Natraj Master)

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ (BiggBoss Nonstop) లో భాగంగా ఈవారం ఎలిమినేషన్ లో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో గత రెండు మూడు రోజులుగా అసహనంతో ఉన్న మాస్టర్ ఈవారం ఎలిమినేషన్ అవుతానని ఆయ‌న‌ ముందుగానే ఊహించారు. ఆయ‌న‌ అనుకున్నట్లుగానే , భయపడినట్లుగానే ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. గ‌త‌వారం బిందుతో నామినేషన్స్ సంద‌ర్భంగా న‌ట‌రాజ్ మాస్ట‌ర్ అప్పుడు లక్ష్మణబాణం వేశారు. ఆడియన్స్ నీ ముక్కు కోస్తారు కాస్కో అంటూ మాట్లాడారు. అలాగే, అఖిల్ తో గొడ‌వ సంద‌ర్భంగా నీకు ఉన్నట్లుగా నాకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లేరు. నా కష్టంతోనే ఇక్కడి వరకూ వచ్చానంటూ మాట్లాడారు. తర్వాత మ‌రో కంటెస్టెంట్లు అనిల్ తో , బాబాభాస్కర్ (Baba Bhaskar) తో కూడా ఆర్గ్యూమెంట్ పెట్టుకున్నారు. యాంక‌ర్ శివతో కూడా ఇదేవిధంగా వితండ‌వాదం చేశారు. ఇలా, గత వారం నుంచీ హౌస్ లో ఆయన అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆడియన్స్ తో నేరుగా మాట్లాడి ఓటింగ్ అప్పీల్ చేసుకునేందుకు తహతహలాడిపోతారు. దీనికోసం హౌస్ లో పిచ్చిపిచ్చిగా ప్ర‌వ‌ర్తించారు. అయితే, నటరాజ్ మాస్టర్ ఓటింగ్ అప్పీల్ చేసుకునేటప్ప‌టికే పుణ్యకాలం కాస్త దాటిపోయింది. ఓటింగ్ ముగిసే శుక్రవారం వ‌ర‌కు అది టెలికాస్ట్ కాలేదు. ఇక యాంక‌ర్ శివది అయితే శనివారం ఎపిసోడ్ లో టెలికాస్ట్ అయ్యింది. దీంతో శివకి కూడా ఓటింగ్ అప్పీల్ అనేది తర్వాత వారానికి పనికివస్తుం ది.

దీంతో ఎట్టకేలకి నటరాజ్ మాస్టర్ (Natraj Master) జర్నీ హౌస్ లో ముగిసిన‌ట్ల‌యింది. అయితే, మొద‌టినుంచీ టాప్ – 5 కి వెళ్లకపోతే వేస్ట్ అంటూ మాస్టర్ మొత్తుకుంటూనే ఉన్నారు. ఇక‌, ఆయ‌న‌ జెర్నీ చాలా ఎమోషనల్ గా సాగింది. గ‌త సీజ‌న్ లో కంటే ఈ సీజన్ లో నటరాజ్ మాస్టర్ జ‌ర్నీలో చాలా హైలెట్స్ ఉన్నాయి. అలాగే మాస్టర్ కూడా ఈ సీజ‌న్ లో చాలా షేడ్స్ చూపించారు. ఆయ‌న ఇప్ప‌టికే గ‌తంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు తేజస్వి, హమీదా, అరియానా, అఖిల్, బిందు, శివ, ఆఖరికి బాబాభాస్కర్ తో సహా అందరితో ఆర్గ్యూమెంట్స్ పెట్టుకున్నారు. లాజిక్ లేకుండా మాట్లాడుతూ.. గేమ్ గురించి మాట్లాడకుండా, కొన్నిసార్లు పర్సనల్ గా కూడా దూషించారు. ఈ నేప‌థ్యంలో హౌస్ మేట్స్ అంద‌రూ మాస్టర్ ని ఎదిరించారు. ఇక‌, కీలక సమయంలోనూ ఆయ‌న‌కు ఎవ‌రూ సపోర్ట్ చేయలేదు. అందుకే, న‌ట‌రాజ్ మాస్టర్ మరింత బరెస్ట్ అయ్యారు. మరోవైపు బిందు మాధ‌వి (Bindu Madhavi), శివ ఇద్దరూ టాప్ 5కి వెళ్లబోతున్నారని ఆయ‌న‌ ముందుగానే ఊహించాడు. అందుకే, వాళ్లని మ‌రింత‌ టార్గెట్ చేశారు. వారిని గ‌త‌వారం ఎగ్జిట్ ఫ్రేమ్ కింద నిలబెట్టి మరీ తన కోపాన్ని తీర్చుకున్నాడు. అందులోనూ ముఖ్యంగా బిందు మాధ‌విని టార్గెట్ చేసి పర్సనల్ గా మాట్లాడటం అనేది నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ కి కారణం అయ్యిందనే చెప్పవ‌చ్చు. ఎందుకంటే, సోషల్ మీడియాలో సైతం బిందు మాధ‌వి ఫాలోవర్స్ అందరూ మాస్టర్ అన్న మాటలని తీవ్రంగా వ్యతిరేఖించారు. దీంతో ఆ ఎఫెక్ట్ ఓటింగ్ పై ప‌డడంతో మాస్టర్ ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. 

ఇక‌, గత కొన్ని వారాలుగా నటరాజ్ మాస్టర్ (Natraj Master) కి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది స‌రిగా లేదు. ఒకసారి కెప్టెన్ గా ఉండ‌డం వ‌ల్ల‌, మ‌రోసారి ఎవ్వరూ నామినేట్ చేయకపోవడం వల్ల న‌ట‌రాజ్ మాస్ట‌ర్ నామినేషన్స్ లోకి రాలేదు. దీంతో ఆయ‌న‌కు వ‌చ్చిన‌ ఓటింగ్ కూడా అంతంత మాత్రంగానే జరిగింది. ఏది ఏమైనా గ‌త సీజ‌న్ లో కంటే ఈసారి సీజన్ లో నటరాజ్ మాస్టర్ తనదైన స్టైల్లో చెరగని ముద్ర వేశారనే చెప్పాలి. ఇందులో భాగంగానే ఓటీటీ సీజన్ లో త‌న‌దైన‌ బెంచ్ మార్క్ ఆర్గ్యూమెంట్స్ తో ఫుల్ సక్సెస్ అయ్యారు. ఇక‌, లాస్ట్ సీజన్ కంటే కూడ తన గేమ్ లో మంచి పవర్ ని చూపించాడు. టాస్క్ లలో సైతం రెచ్చిపోయి మరీ ప్రాణం పెట్టి ఆడాడు న‌ట‌రాజ్ మాస్ట‌ర్. కానీ, ప్ర‌తిసారీ నా బిడ్డకోసమే గేమ్ ఆడుతున్నా అంటూ ఎమోషనల్ అయిపోవడం, పదే పదే అదే మాట చెప్పడం అనేది ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోగా, చిరాకు తెప్పించింది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!