బిగ్ బాస్ నాన్ స్టాప్(BiggBoss Nonstop): 9వ వారంలో బిగ్ ట్విస్ట్.. హ‌మీదా ఎలిమినేట్?

Updated on May 01, 2022 05:39 PM IST
హ‌మీదా  (Hamida)
హ‌మీదా (Hamida)

తెలుగు బిగ్‌బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) షో క్ర‌మంగా చివరి ద‌శ‌కు చేరుకుంటోంది. ఇప్పటివ‌ర‌కు 8మంది ఎలిమినేట్ అయిన ఈ షో ప్ర‌స్తుతం 9వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం మొత్తం బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఇంటి స‌భ్యుల‌ను హౌస్ లోకి పంపారు.  దీంతో ఈ వారం మొత్తం ఎమోష‌నల్ గా మారింది. కాగా, ఈ వారానికి గానూ బాబా భాస్కర్, అరియానా, మిత్రా శర్మ, యాంకర్ శివ, అనీల్ రాథోడ్, నటరాజ్ మాస్టర్, హమీదా (Hamida) నామినేట్ అయ్యారు. 

గ్రాండ్ ఫినాలే (Grand Finale) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న సమ‌యంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్నదానిపై జోరుగా చర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రో లీకువీరులు తేల్చేశారు. ఈ మేర‌కు బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి హమీదా ఎలిమినేట్‌ అయినట్లు లీకువీరులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 

నిజానికి ఈ నామినేషన్స్ ముందు వరకూ నటరాజ్ మాస్టర్ నామినేషన్స్‌లోకి వస్తే బయటకు పంపడానికి రెడీగా ఉన్నారు చాలామంది ప్రేక్ష‌కులు. దీంతో 9 వ వారంలో ఆట మొత్తం మాస్ట‌ర్ వైపే మళ్లింది. కిల్లర్ టాస్క్‌లో ఆయ‌న త‌న‌ నట విశ్వరూపం చూపించారు. ఈ వారం మొత్తం నటరాజ్ మాస్టర్ వన్ మ్యాన్ షో చేయడంతో ది బెస్ట్ పెర్ఫామర్ గా మారారు. ఈ నేప‌థ్యంలో అతని ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది.

అదేవిధంగా ముందుగా మ‌రో కంటెస్టెంట్ అనిల్‌ను కూడా ఎలిమినేట్‌ చేయాలనుకున్నారని, కానీ ఏదో సమస్య వల్ల చివరి నిమిషంలో హమీదాను పంపించివేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఏదేమైనా అనిల్‌కు లక్‌ బాగానే ఉందంటున్నారు బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌. దీనికి తోడు అతనికి అషురెడ్డి, అఖిల్ ఫ్యాన్స్ ఓట్లు కూడా షేర్ కావడంతో ఎలిమినేషన్ గండం నుంచి ఈజీగా గట్టేక్కేశాడు అనిల్.

ఇక మిత్రా శర్మ పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. తొలి ఐదు వారాలు గేమ్ ను స్టడీ చేయ‌డం పైనే ఫోకస్ పెట్టిన ఈ భామ మెల్లగా పుంజుకుంటోంది. 9వ వారానికి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ అయ్యింది. కానీ, మిగిలిన కంటెస్టెంట్స్‌తో పోల్చుకుంటే మిత్రా శ‌ర్మ‌ వీక్ అయినప్పటికీ బయట ఉన్న ఆమె పీఆర్ టీం స్ట్రాంగ్ గా ఉండ‌డంతో ఓట్లు కూడా దండిగా పడుతున్నాయి.

ఇకపోతే ఈవారం మాజీ బిగ్ బాస్ బ్యూటీలు అరియానా, హమీదాలకు లీస్ట్ ఓటింగ్ పడిన‌ట్లు తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేట్ కావడానికి వీళ్లిద్దరూ నువ్వా నేనా అంటూ పోటీపడ్డారు. అయితే, ఈ పోటీలో హమీదా అభిమానులు వెనుకపడటంతో అరియానా సేవ్ అయినట్టు తెలుస్తోంది. అతి తక్కువ ఓట్ల వ్యత్యాసంతో హమీదా ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. 

మ‌రోవైపు, బిగ్ బాస్ సీజన్ 5లో ఐదో వారంలోనే ఎలిమినేట్ అయిన హమీదా.. నాన్ స్టాప్ షో లో మాత్రం 9 వ వారం వరకూ నెగ్గుకువ‌చ్చింది. నిజం చెప్పాలంటే అరియానా కంటే హ‌మీదానే బెటర్‌గా గేమ్ ఆడుతోంది. అయితే, హమీదా సరైన ఫ్యాన్ బేస్ ను బిల్డ్ చేసుకోలేకపోవడంతో ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. హ‌మీదా కంటే వీక్ కంటెస్టెంట్స్ హౌస్‌లో ఉన్నప్పటికీ హమీదాను ఎలిమినేట్ కావడం ఆమె బ్యాడ్ లక్ అనే చెప్పవ‌చ్చు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!