Bigg Boss Telugu: బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ చీర క‌డితే కుర్రాళ్ల మ‌తి పోవాల్సిందే!

Updated on May 22, 2022 12:49 PM IST
నటి భాను శ్రీ (Bigg Boss Beauty Bhanu Sri)
నటి భాను శ్రీ (Bigg Boss Beauty Bhanu Sri)

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss Telugu) ఫేమ్, నటి భాను శ్రీ (Bhanu Sri) చీరకడితే కుర్రాళ్ల గుండెలు మ‌తిత‌ప్పిపోవాల్సిందే. భాను శ్రీ సోష‌ల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ, కుర్రకారుని ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈమె.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన గ్లామర్ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. భాను గ్లామర్‌ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. భాను శ్రీ అభిమానులు ఈ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ.. షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. 

ఇటీవలి కాలంలో వరుసగా మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తున్న ఈ భామ‌.. తాజాగా శారీలో నాజుకు అందాలను ఒలకబోస్తూ, కుర్రకారును ఆకట్టుకుంటోంది. మొద‌ట్లో మోడల్‌గా తన కెరీర్ ను ప్రారంభించిన భానుశ్రీ.. ఇప్పుడిప్పుడే నటిగా అవకాశాలను అందుకుంటోంది. కెరీర్ ప్రారంభంలో జెమినీ టీవీలో ప్రసారమయ్యే, టెలివిజన్ డైలీ సీరియల్ ‘జాబిలమ్మ’లో నటించింది. ఆ సీరియ‌ల్‌లో తన పాత్రకు న్యాయం చేయడంతో పాటు, పలు చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. ఇక‌, ఆ త‌ర్వాత అప్పుటి క్రేజ్‌తోనే ‘బిగ్ బాస్ తెలుగు’ (Bigg Boss Telugu) సీజన్ 2తో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో భానుశ్రీ తనదైన శైలిలో టాస్క్‌లను ఆడి బాగా పాపులర్ అయ్యింది. 

చీర‌క‌ట్టులో హొయ‌లు పోతున్న భానుశ్రీ (Bhanu Sri)

కానీ, అభిమానుల మ‌న‌సు గెలుచుకోలేక‌ షో మధ్యలోనే భాను శ్రీ ఎలిమినేట్ కావాల్సి వ‌చ్చింది. ఇక‌, బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత భానుకు మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం హీరోయిన్‌గా కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంటోంది. దీంతో భాను తన పాపులారిటీని మరింతగా పెంచుకునేందుకు, సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉంటోంది. త‌న హాట్ ఫోటోషూట్లనూ నిర్వహిస్తూ నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది. తాజాగా భాను శ్రీ పోస్ట్ చేసిన కొన్ని పిక్స్, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

కాగా, ఈ భామ‌ తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది. శారీని కళాత్మకంగా క‌ట్టుకొని, చాలా చక్కగా శరీరానికి అద్దినట్టుగా చుట్టుకుంది. త‌ను క‌ట్టుకున్న‌ చీరకొంగును చేతికి చుట్టుకొని, నడుము అందాలను చూపిస్తూ మ‌రీ కుర్రకారు మతిపోగొడుతోందీ బ్యూటీ. స్లీవ్ లెస్ జాకెట్‌లో, తన గ్లామర్ షోతో మైస్మరైజ్ చేస్తోంది. ఇప్ప‌టికే ఈ భామ‌ ఇన్ స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్‌ను దక్కించుకుంది. ఇదే క్రమంలో భాను శ్రీ  తన పాపులారిటీని పెంచుకునేందుకు, ఇలా గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ వ‌స్తోంది. ఇక‌, ఈ బ్యూటీ అందాలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. లైక్‌లు, కామెంట్లతో ఆమెని ఎంకరేజ్ చేస్తున్నారు. 

భానుశ్రీ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ‘బాహుబలి ది బిగినింగ్’ (Bahubali), కుమారి 21ఎఫ్, ‘కాటమరాయుడు’, ‘మహానుభావుడు’, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2017లోనే ‘ఇద్దరి మధ్య 18’ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. చివరిగా ‘నల్లమల’ మూవీలో నటించి, ఓ మెస్తారు సక్సెస్‌ను అందుకుంది. భాను శ్రీ ‘ఢీ’ వంటి పలు టీవీ షోల ద్వారా ప్రేక్షకులను పలకరిస్తూ, అలరిస్తూ వస్తోంది. ఈ మధ్యకాలంలో ‘ఏడు చేపల కథ’ వంటి బోల్డ్ కంటెంట్ సినిమాల్లో కూడా నటించి తన గ్లామర్ తో మెప్పించింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!