బిగ్ బాస్ తెలుగు OTT: తన తల్లి హౌస్ లోకి రావ‌డంతోఅఖిల్ భావోద్వేగం

Updated on Apr 30, 2022 09:48 PM IST
అఖిల్ తల్లి (Akhil Sarthak With His Mother)
అఖిల్ తల్లి (Akhil Sarthak With His Mother)

తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో ప్ర‌స్తుతం ఫ్యామిలీ వీక్ న‌డుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు అషు రెడ్డి తల్లి, నటరాజ్ మాస్ట‌ర్ భార్య, కూతురు, యాంక‌ర్ శివ సోదరి ఎంట్రీ ఇచ్చారు. అనంత‌రం, ఇంట్లోకి మరికొంత మంది పోటీదారుల కుటుంబ సభ్యులను బిగ్ బాస్ స్వాగతించనున్నారు. ఇక‌, రాబోయే ఎపిసోడ్ లో అఖిల్ తల్లి ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లు తాజా టీజర్ లో చూపించారు. 

దీంతో తల్లిని చూడగానే అఖిల్ ఎమోషనల్ అవుతాడు. ఈ నేప‌థ్యంలో ఎవరితోనూ ఎలాంటి భావోద్వేగ సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండమని ఆమె అతన్ని ప్రోత్సహిస్తుంది. అతనిని ఎవ‌రైనా తిడితే ఎప్పటిక‌ప్పుడు తిరిగి ఇచ్చేయ‌మని ప్రోత్సహిస్తుంది. కాగా, బిగాబాస్ సీజన్ 4లో సైతం అఖిల్‌ని ఉత్సాహపరిచేందుకు అతని తల్లి అప్పుడు హౌస్‌లోకి ప్రవేశించిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు ఆ సీజన్‌లో అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు.

మ‌రోవైపు ఈ టీజ‌ర్ లో మిత్రా శ‌ర్మ‌, అరియానా గ్లోరీ వారికి సంబంధించిన‌ ప్రియమైన వారిని ఉత్సాహపరిచేందుకు ఇంట్లోకి ప్రవేశించడం కూడా చూపించారు. అందులో ఈ సీజన్‌లో కెప్టెన్ కాలేకపోయినందుకు చింతిస్తున్నట్లు అరియానా కన్నీళ్లు పెట్టుకోవడం గమనించవచ్చు. కాగా, హౌస్‌మేట్స్ కు సంబంధించిన కుటుంబ స‌భ్యుల ప్రవేశం ఎల్లప్పుడూ కంటెస్టెంట్ల‌కు ఉద్వేగభరితమైనప్పటికీ కీలకమైనది. కుటుంబ సభ్యుల అభిప్రాయాలు, హెచ్చరికలు, ప్రోత్సాహం పోటీదారుల మనోధైర్యాన్ని, ఆట తీరును ఎప్ప‌టికప్పుడు పెంచుతుందని వారు భావిస్తారు. కాగా, కొన్ని కొన్నిసార్లు కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు సైతం పాపుల‌ర్ అవుతుంటారు. 

సీజన్ 2లో కౌశల్ మందా భార్య, పిల్లలు, సీజన్ 3లో వరుణ్ సందేశ్ అమ్మమ్మ, బిబి సీజన్ 5లో మానస్ నాగులపల్లి తల్లి, సిరి హన్మంత్ తల్లి వంటి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా షోలో కనిపించిన తర్వాత ప్రజాదరణ పొందారు. ఇదిలా ఉంటే. ఈ షో లో బాబా భాస్కర్‌ను ఈ సీజన్‌కు చివరి కెప్టెన్‌గా బిగ్ బాస్ పట్టాభిషేకం చేశారు. మరోవైపు, ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్లు ఎవిక్షన్ కోసం నామినేట్ అయ్యారు. మరి ఎవరు పోటీ నుంచి తప్పుకుంటారో చూడాలి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!