Top films which promoted the value of education : సినిమాల్లో "విద్యా" వెలుగులు

Updated on Apr 16, 2022 07:45 PM IST
ప్ర‌పంచాన్ని మార్చాలంటే శ‌క్తివంత‌మైన ఆయుధం చ‌దువు ఒక్క‌టే. అలాంటి చ‌దువు ప‌దిమందికీ పంచితే మ‌రింత మెరుగ‌వుతుంది. కొంద‌రు ర‌చ‌యితలు ఇదే దారిలో సాగారు. చ‌దువు, సంస్కారం మ‌నిషికి ఎంత ముఖ్య‌మో తెలిపే క‌థ‌ల‌ను తెలుగు సినిమాకు అందించారు.
ప్ర‌పంచాన్ని మార్చాలంటే శ‌క్తివంత‌మైన ఆయుధం చ‌దువు ఒక్క‌టే. అలాంటి చ‌దువు ప‌దిమందికీ పంచితే మ‌రింత మెరుగ‌వుతుంది. కొంద‌రు ర‌చ‌యితలు ఇదే దారిలో సాగారు. చ‌దువు, సంస్కారం మ‌నిషికి ఎంత ముఖ్య‌మో తెలిపే క‌థ‌ల‌ను తెలుగు సినిమాకు అందించారు.

రాక్ష‌సి (Raatchasi)

ఓ గవర్నమెంట్ స్కూల్ టీచ‌ర్ క‌థ‌ ఇది. జ్యోతిక ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. విద్యా వ్యవస్థలో మార్పు కోసం ఓ ఉపాధ్యాయురాలు చేసే పోరాటమే ఈ సినిమా.  స్కూల్లో పిల్ల‌ల‌ను, టీచ‌ర్ల‌ను కూడా సన్మార్గంలో పెట్టడానికి ఓ అధ్యాపకురాలు పడే ఆరాటం ఈ చిత్రం. ఈ సినిమాకు గౌత‌మ్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

పిల్ల జ‌మీందార్ (Pilla Zamindar)

కోటీశ్వరుడైన జమీందారు వారసుడు, మామూలు మనిషిగా మారితే జీవితం ఎలా ఉంటుంద‌నేది ఈ చిత్ర క‌థ‌.  చదువు పట్ల శ్రద్ధలేని ఓ యువకుడు, డిగ్రీ పట్టా ఉంటేనే ఆస్తి కలిసొస్తుందని తెలిసి పడే అష్ట కష్టాలు అన్ని ఇన్ని కావు. ఈ క్రమంలో అదే విద్యార్థి  తన కాలేజీలో ఎదుర్కొనే ఇబ్బందుల సమాహారమే ఈ చిత్రం.  జి. అశోక్ ఈ సినిమాకి  ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. 

హై హై నాయకా (Hai Hai Nayaka)

జంధ్యాల దర్శకత్వంలో నరేష్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఓ మొండి విద్యార్థికి సంబంధించింది. స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పిన మాట వినకుండా, బూతులు తిట్టే ఓ కుర్రాడిని మార్చే మాస్టారి పాత్రలో నరేష్ నటించారు. విద్యార్థిని శిక్షించి దారిలోకి తీసుకురాలేమని.. ప్రేమతోనే తన మనసును మార్చాలనే సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది. 

ఓన‌మాలు (Onamalu) 

చ‌దువుల మాస్టారిగా త‌న‌ ఆశ‌యాలను సాధించే పాత్ర‌లో రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించారు. త‌న పిల్ల‌లతో క‌లిసి అమెరికా వెళ్లి, అక్క‌డ ఉండ‌లేక త‌న సొంతూరికి వ‌చ్చేస్తారు. తన ఊరిలో జరుగుతున్న సంఘటనలను చూసి.. మార్పు కోసం తపనపడే ఓ మంచి మనిషి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర క‌థ‌. ఈ సినిమాకి క్రాంతి మాధవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

గౌతం ఎస్. ఎస్. సి (Gowtham SSC)

ఈ సినిమాలో చ‌ద‌ువుకోకుండా జ‌ల్సాలు చేసే పాత్ర‌లో హీరో న‌వ‌దీప్ న‌టించాడు.కానీ అనుకోని సందర్భంలో హీరోలో వచ్చిన మార్పు.. తనను ఐఏఎస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా చేస్తుంది. మరి అతను సక్సెస్ అయ్యాడో లేదో తెలుసుకోవాలంటే, ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైంది.

స్టూడెంట్ నంబ‌ర్ వన్ (Student No 1)

ఆపదలో ఉన్న ఓ మ‌హిళ‌ను కాపాడ‌బోయి నేర‌స్తుడైన విద్యార్థి, తర్వాత న్యాయ కళాశాలలో చేరి మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. జైలు జీవితం గ‌డ‌ుపుతూనే, ఓ మంచి న్యాయవాదిగా ఎదుగుతాడు. తన కన్నతండ్రి తప్పుడు కేసులో చిక్కుకుంటే, తానే ఆ కేసును వాదిస్తాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్  ఈ చిత్రంలో హీరోగా న‌టించాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వహించిన తొలి సినిమా స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్.

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!