Top 10 Character Based Stories in Tollywood : సవాళ్లకు ప్రతి సవాలు విసిరే "హీరో"యిజం

Updated on Apr 18, 2022 06:20 PM IST
 ఓ స‌వాలు సినిమా క‌థ‌నే మార్చేస్తుంది. అదే స‌వాలు హీరోల రేంజ్ పెంచేస్తుంది. హీరోల ఛాలెంజ్‌ల‌కు థియేట‌ర్ల‌లో ఆడియ‌న్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రేక్ష‌కుల‌కు గుర్తిండి పోయే ఛాలెంజింగ్ రోల్స్ ఏంటో చూద్దాం.
ఓ స‌వాలు సినిమా క‌థ‌నే మార్చేస్తుంది. అదే స‌వాలు హీరోల రేంజ్ పెంచేస్తుంది. హీరోల ఛాలెంజ్‌ల‌కు థియేట‌ర్ల‌లో ఆడియ‌న్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రేక్ష‌కుల‌కు గుర్తిండి పోయే ఛాలెంజింగ్ రోల్స్ ఏంటో చూద్దాం.

ఓ స‌వాలు సినిమా క‌థ‌నే మార్చేస్తుంది. అదే స‌వాలు హీరోల రేంజ్ పెంచేస్తుంది. హీరోల ఛాలెంజ్‌ల‌కు థియేట‌ర్ల‌లో ఆడియ‌న్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రేక్ష‌కుల‌కు గుర్తిండి పోయే ఛాలెంజింగ్ రోల్స్ ఏంటో చూద్దాం.

1. ఛాలెంజ్ - చిరంజీవి

మ‌నిషి త‌లుచుకుంటే ఏదైనా చేయ‌వ‌చ్చు అనే లైన్‌లో సాగుతుంది ఈ సినిమా. రావు గోపాల‌రావు డ‌బ్బు అహంకారంతో చిరంజీవిని అవ‌మానిస్తాడు. అవ‌మానం నుంచి పుట్టిందే ఛాలెంజ్. ల‌క్ష‌ల రూపాలయ‌లు సంపాదించి చూపించి ఛాలెంజ్ గెలిచే పాత్ర‌లో చిరంజీవి ఒదిగిపోయాయి. 

2. నాయ‌కుడు - క‌మ‌ల్ హాస‌న్

వరల్డ్ డాన్ వ‌ర‌దా భాయ్ జీవితం ఆదారంగా నాయ‌కుడు సినిమా తీశారు. క‌మ‌ల్ హాస‌న్ నాయ‌కుడిగా న‌టించి మెప్పించారు. రియాలిటీ మిస్ కాకుడ‌ద‌ని క‌మ‌ల్ సినిమాలో త‌న సొంత తుపాకీని వాడారు.

3. శివ - నాగార్జున‌

నాగార్జున సినిమా కేరీర్‌లో సూప‌ర్ హిట్ సినిమా శివ‌. కాలేజీ విద్యార్థి శివ‌ రౌడీషీట‌ర్ భ‌వానిని ఎదిరిస్తాడు. ఆ త‌ర్వాత గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారి మంచి ప‌నులు చేస్తాడు. ఈ సినిమాలో నాగార్జున చేసిన‌ సైకిల్ చైన్ ఫైట్ ఇప్ప‌టికీ క్రేజే.

4. ఛత్రపతి - ప్రభాస్

ఒక్క అడుగు... అంటూ భూమి కోసం శివాజీగా ఉన్న ప్ర‌భాస్ ఛ‌త్ర‌ప‌తిగా మార‌తాడు. త‌న పోర్టు ఏరియా జోలికి వ‌చ్చిన వాళ్ల‌ను అంతం చేస్తాడు ఛ‌త్ర‌ప‌తి. అమ్మ సెంటిమెంట్ కూడా అంతే హైలైట్‌గా నిలిచింది. రెండు ఎమోషన్స్ ఉన్న పాత్ర‌ను చేసి మెప్పించారు ప్ర‌భాస్. 

5. జగడం - రామ్ పోతినేని

సినిమా పేరే జ‌గ‌డం. ఇక జ‌గ‌డాల‌తో త‌నేంటో చూపించాల‌నుకునే శ్రీను పాత్ర‌లో రామ్ న‌టించారు. స‌వాళ్ల‌ను ఎదుర్కొడానికి రామ్  ఏం చేస్తాడ‌నేది సినిమా స్టోరి. 

6. జల్సా - పవన్ కళ్యాణ్

సంజ‌య్ సాహు ఓ మాములు యువ‌కుడు.. న‌క్సలైట్ల‌తో చేరుతాడు. ఆ త‌ర్వాత లీడ‌ర్‌గా మారే పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించారు. సంజ‌య్ సాహు ప్రేమ కోసం ఎలా మారుతాడ‌నే క‌థ‌తో తీసిన సినిమా జ‌ల్సా.
7. బిజినెస్ మ్యాన్ - మహేష్ బాబు

సూర్య‌భాయ్ మిడిల్ క్లాస్ అబ్బాయి... కానీ ముంబైకే రాజ‌య్యే రేంజ్‌కు మార‌తాడు. మహేష్ బాబు యాక్టింగ్ , డైలాగ్స్ బులెట్ల‌లా దూసుకుపోయాయి. 

8. పుష్ప - అల్లు అర్జున్

న‌మ్మ‌కం ఉంటే ఎంత క‌ష్ట‌మైనా కాపాడ‌తాడు... మోసం చేస్తే మోసాల‌తోనే మైండ్ బ్లాక్ చేసే పాత్ర పుష్ప‌... పుష్ప‌రాజ్. ఫైట్, డైలాగ్స్‌తో ఎక్క‌డా త‌గ్గ‌కుండా.. అల్లు అర్జున్ న‌టించారు. 

9. కేజీఎఫ్ - య‌ష్

ప‌ట్టుద‌ల ఉంటే ప‌ట్టింద‌ల్లా బంగారంలా మార్చుకోవ‌చ్చ‌నే సినిమా కేజీఎఫ్‌లో య‌ష్ న‌టించారు. కామ్‌గా కత్తి ప‌ట్టి ప్ర‌త్య‌ర్థుల‌ను కంగారు పెట్టించడంలో య‌ష్ అద‌ర‌గొట్టాడు. 

స‌వాళ్లున్న సినిమాలు ప్రేక్ష‌కుల‌కు మరింత వినోదాన్ని ఇస్తాయి. హీరోలు ఛాలెంజ్ విసిరే డైలాగ్స్ హుషారెత్తిస్తుంటాయి.

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!