Top 10 Biopics in Tollywood : జీవితమే ఓ సినిమా
జీవితమే ఓ సినిమా
మహానుభావులు లేదా పలువురు వ్యక్తులు తమ జీవిత ప్రయాణంలో సాగించిన, కొన్ని పోరాటాలు చరిత్రలో నిలిపోతాయి. చరిత్రలో వారికంటూ ఓ పేజీ ఉంటుంది. చరిత్రకెక్కిన గొప్ప వ్యక్తుల జీవితాలను ఎందరో దర్శకులు సినిమాలుగా తీశారు. మహావ్యక్తుల గాధలను కళ్లకు కట్టారు. అటువంటి వాటిలో కొన్ని మీకోసం
సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy)
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి. సైరా పాత్రను మెగాస్టార్ చిరంజీవి పోషించారు. తెల్లదొరలకు తెలుగువాడి పౌరుషాన్ని చూపించిన ఓ యోధుడి కథ. ఉరికొయ్యకు వేలాడుతూ కూడా ప్రజల్లో జాతీయస్పూర్తిని నింపాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించారు.
జార్జిరెడ్డి (George Reddy)
చిన్నతనం నుంచి వామపక్ష భావాలు కలిగిన జార్జిరెడ్డి, ప్రజాసమస్యలపై పోరాటం చేశారు. జార్జిరెడ్డిని కాలేజ్ క్యాంపస్‌లోనే హత్య చేశారు. ఇతని జీవితం ఆధారంగా దర్శకుడు జీవన్ రెడ్డి బయోపిక్ తీశారు. ఈ సినిమాలో సందీప్ మాధవ్ జార్జిరెడ్డిగా నటించారు.
రాజన్న (Rajanna)
గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమాల గురించి తెలిపే సినిమా. దొరల పాలన అంతం చేసే దిశగా అడుగులు వేసిన యోధుడు రాజన్న. బ్రిటిష్ వారిని ఎదిరించి చేసిన పోరాటాలు ఈ సినిమాలో చూపించారు. అక్కినేని నాగార్జున రాజన్నగా నటించారు. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు.
కథానాయకుడు, మహానాయకుడు (Kathanayakudu, Mahanayakudu)
ఆ తరం అగ్ర కథానాయకుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఈ బయోపిక్‌లు తీశారు. ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంలోకి ఎలా వచ్చారు. ఆ తర్వాత రాజకీయ రంగానికి ఎలా వెళ్లారనే విషయాలు చూపించారు. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ తండ్రి పాత్రను పోషించారు. క్రిష్ ఈ సినిమాలకు దర్శకత్వం వహించారు.
యాత్ర (Yatra)
రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ యాత్ర. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోని ముఖ్యమంత్రి స్థాయికి వైఎస్ఆర్ చేరుకోవడాన్ని వెండితెరపై చూపించారు. మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు.
మహానటి (Mahanati)
తెలుగులో అలనాటి మేటినటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. కష్టపడి అగ్ర కథానాయకురాలుగా మారిన సావిత్రి అనాథగా మారిపోయిన సంఘటనలను చూపించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రలో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.
రుద్రమదేవి (Rudrama Devi)
కాకతీయ సామ్రాజ్యంలో రుద్రమదేవి ఓ ఆయుధం. బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన గొప్ప యోధురాలు. రుద్రమదేవిగా అనుష్క నటించారు. గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ యాక్ట్ చేశారు. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
వంగవీటి (Vangaveeti)
రాజకీయ నాయకుడు వంగవీటి మోహనరంగా జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. రంగా కాలేజీలో చేసిన పోరాటాల నుంచి రాజకీయ వైపు ఎలా వెళతాడనేది ఈ చిత్ర కథ. సందీప్ కుమార్ రంగాగా నటించారు. ఈ సినిమాకు రాంగోపాల్ వర్మ దర్మకత్వం వహించారు.
అల్లూరి సీతారామరాజు (Alluri Seeta Rama Raju)
స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తీసిన బయోపిక్. బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన తెలుగు వీరుడిగా సూపర్ స్టార్ కృష్ణ నటించారు.ఈ చిత్రానికి వి. రామచంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్ దర్శకులుగా వ్యవహరించారు.
తాండ్ర పాపారాయుడు (Tandra Paparayudu)
18వ శతాబ్ధపు యోధుడు తాండ్ర పాపారాయుడు బయోపిక్ ఇది. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించారు. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 11 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు.