విశ్వక్ సేన్ (Vishwak sen) సినిమాకు పాజిటివ్ టాక్.. ఫుల్ జోష్ లో అభిమానులు!

Published on May 06, 2022 07:21 PM IST

గ‌త రెండు రోజులుగా ఇండ‌స్ట్రీలో ప్రాంక్ వీడియో (Prank Video) వివాదంతో యువ కథానాయకుడు విశ్వ‌క్ సేన్ (Vishwak sen) టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాడు. ఆయ‌న తాజాగా  న‌టించిన‌ 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. హీరోయిన్లు రుక్సార్ థిల్లాన్, రితికా నాయక్ కథానాయికలుగా నటించారు. 'రాజావారు రాణిగారు' దర్శకుడు రవి కిరణ్ కోలా కథ, కథనం, మాటలు అందించడంతో పాటు షో రన్నర్‌గా వ్యవహరించారు. అయితే, ఈ రోజు రిలీజ‌యిన‌ ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. 

హైద‌రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేట‌ర్ వ‌ద్ద విశ్వక్ సేన్ కు అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈలలు, కేక‌ల‌తో హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. అయితే, ఆ వీడియోలో విశ్వ‌క్ సేన్ (Vishwak sen) ఓపెన్ టాప్ కార్ లో నిల‌బ‌డి అభిమానుల‌కు అభివంద‌నం చేస్తూ క‌నిపించాడు. విక్ట‌రీ సింబ‌ల్ చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. కాగా, ఇటీవ‌ల ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఓ ప్రాంక్ వీడియో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ వీడియోపై ప‌లు వివాదాలు కూడా తెర‌పైకి వ‌చ్చాయి. దీంతో ఈ సినిమాకు పైసా ఖ‌ర్చు లేకుండానే ఫుల్ ప‌బ్లిసిటీ వ‌చ్చిన‌ట్ల‌యింది.