Neha Shetty: స్కిన్ షో తో అందాల విందు పంచుతున్న 'డీజే టిల్లు' (DJ Tillu) బ్యూటీ నేహా శెట్టి..!
'డీజే టిల్లు' మూవీ ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) రెచ్చిపోతోంది. ఆ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కు ఎంతటి పేరు వచ్చిందో.. హీరోయిన్ నేహా శెట్టికి కూడా అంతే పేరు వచ్చింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన 'మెహబూబా' సినిమాతో నేహా శెట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమా అంతగా ఆడకపోయినా.. నేహా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
'మెహబూబా' (Mehabooba) సినిమా తర్వాత సందీప్ కిషన్‌తో కలిసి 'గల్లీ రౌడీ' సినిమా చేశారు. ఆ సినిమా కూడా కమర్షియల్‌గా హిట్ అవలేదు. కానీ ఆ తరువాత సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'డీజే టిల్లు' ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో నేహా బోల్డ్ యాక్టింగ్.. సిద్థుతో పోటీపడి హాట్ హాట్ సీన్లకు ఆడియన్స్ అదిరిపోయారు.
'డీజే టిల్లు' (DJ Tillu) తర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ ఈ అమ్మడు మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. డీజే టిల్లుతో క్రేజ్ కంటిన్యూ చేయడానికి ఆమె చూస్తున్నారు. ఈ అమ్మడు ఆ సినిమా లో అందాలతో అదరగొట్టేసింది. ఇందులో ఎక్కువ శాతం చీర కట్టులో ఉన్నా కూడా అందం అంటే ఇలానే ఉండాలి అన్నట్లుగా అందరినీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. అప్పటి నుంచి ప్రేక్షకులు నేహా శెట్టి కి బదులుగా రాధిక అనే ఎక్కువగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నేహా శెట్టి సోషల్ మీడియాలో తనదైన మార్క్ స్కిన్ షోతో (Neha Shetty Skin Show) అదరగొడుతోంది. సీనియర్ హీరోయిన్ లను మించి చూపించేస్తోంది. డిఫరెంట్ ఫోటో షూట్స్ తెగ అదరగోడుతోంది. తాజాగా ట్రెడిషనల్ వేర్ లో హాట్ హాట్ గా కనిపించింది బ్యూటీ. ఫ్యాషన్ వేర్ లో క్లీవేజ్ షోలు చూసిన నెటిజన్లకు.. సరికొత్తగా ట్రెడిషనల్ వేర్ లో.. బంపర్ ఆఫర్ ఇచ్చేస్తోంది.