టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). దసరా పండుగకు రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. పండుగకు రిలీజైన మరో మూవీ ‘గాడ్‌ఫాదర్’ ముందు ‘ది ఘోస్ట్’ నిలవలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి కమ్‌బ్యాక్‌లో మంచి టాక్ తెచ్చుకున్న చిత్రంగా ‘గాడ్‌ఫాదర్’ నిలిచింది. ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ రాగా.. ‘ది ఘోస్ట్’కు ఫ్లాప్ టాక్ వచ్చింది. దీంతో దసరా రేసులో నాగ్ చిత్రం పరాజయం పాలైంది.
థియేటర్లలో ఫెయిలైనప్పటికీ ఓటీటీలో మాత్రం ‘ది ఘోస్ట్’ సినిమా హవా కొనసాగిస్తోంది. అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుని సత్తా చాటుతోంది. బిగ్ స్క్రీన్లలో అక్టోబర్ 5న రిలీజైన ఈ చిత్రం.. నవంబర్ 2న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్స్ లిస్టులో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోగా.. తెలుగు వెర్షన్ నాలుగో ప్లేస్‌ను దక్కించుకుంది. రెండు భాషల్లో ట్రెండింగ్‌లో ఉండటంతో మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేసింది.
రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ను కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది ఘోస్ట్’ చిత్రం వెనక్కి నెట్టేసింది. ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు విడుదలైనప్పటికీ ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్‌ను ట్రెండింగ్ లిస్టులో అధిగమించలేకపోయాయి. కానీ నాగ్ మూవీ మాత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie).. నెట్‌ఫ్లిక్స్ టాప్–10 ట్రెండింగ్ మూవీస్ లిస్టు నుంచి వెళ్లిపోయింది.
ఇకపోతే, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ‘ది ఘోస్ట్’ సినిమాలో.. నాగార్జున సరసన క్యూట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర్ సినిమాస్ ఎల్ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలసి ఈ ప్రాజెక్టును భారీ వ్యయంతో నిర్మించారు.
Follow Us