టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) నటించిన తాజా చిత్రం ‘హిట్ ది సెకండ్ కేస్’ (Hit 2). సస్పెన్స్ మర్డర్ థ్రిల్లర్ నేపథ్యంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘హిట్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయింది. దీంతో, ఆ సినిమాకు సీక్వెల్‌గా ఇటీవల విడుదలయింది ఈ సినిమా. తొలి భాగానికి దర్శకత్వం శైలేష్ కొలను దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది.
భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీ కలెక్షన్స్‌తో దుమ్ము లేపింది. ఈ సినిమాలో అడివి శేష్ (Adivi Sesh) పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. నటనలో భాగంగా తనదైన యాటిట్యూడ్‌తో ఆయన ఈ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక, దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రంలోని ట్విస్టులను చివరివరకు మెయింటెయిన్ చేశారు. దీంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు.
‘హిట్ 2’ (Hit 2) సినిమాలో అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్ గా నటించింది. రావు రమేష్, కోమలి ప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, సుహాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిరనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. గ్యారీ బీ.హెచ్ ఎడిటర్‌గా పనిచేయగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం అందుతోంది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం హక్కుల కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా తీవ్రంగా పోటీ పడగా.. చివరకు భారీ ధరకు ప్రైమ్ వీడియోనే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
జనవరి మొదటి వారంలో ‘హిట్ 2’ (Hit 2) సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. మరి, థియేటర్లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Read More: 'హిట్' (Hit) మూవీ సిరీస్ లో నటించనున్న సమంత (Samantha).. అడివి శేష్ (Adivi Sesh) ఏమన్నారంటే..?
Follow Us