Bigg Boss Season 7: బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్‌కు కొత్త హోస్ట్!.. నాగ్ స్థానంలో బాలయ్య వస్తున్నారనడంలో నిజమెంత? 

Bigg Boss Season 7: బిగ్‌బాస్ తదుపరి సీజన్‌కు హోస్ట్‌గా బాలకృష్ణ (Balakrishna)ను తీసుకోవాలని షో నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం

బిగ్‌బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సీజన్‌కు పాపులారిటీని మరింతగా పెంచుకుంటూ టీఆర్పీలో మిగిలిన టీవీ షోలను వెనక్కినెడుతూ వస్తోంది బిగ్‌బాస్ షో. జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున లాంటి స్టార్ హీరోలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం కూడా ఈ షో ఇంత సక్సెస్ సాధించడానికి ఓ కారణమని చెప్పొచ్చు. అయితే బిగ్‌బాస్ (Telugu Bigg Boss) తదుపరి సీజన్‌కు హోస్ట్‌ను మార్చే అవకాశాలు ఉన్నాయట. గత రెండు సీజన్లుగా ఆదరణ, జనంలో ఆసక్తి తగ్గుతుండటం షో నిర్వాహకులను ఆలోచనలో పడేసిందని టాక్. 

నాగార్జున (Nagarjuna) స్థానంలో మరో స్టార్ హీరోను హోస్టుగా తీసుకోవాలని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna)ను హోస్టింగ్ బాధ్యతలను అప్పజెప్పాలని అనుకుంటున్నారని సమాచారం. ఈ విషయమై ఇప్పటికే ఆయన్ను షో నిర్వాహకులు సంప్రదించారని వినికిడి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దీంట్లో ఎంత నిజం ఉందనేది అధికారిక ప్రకటన వస్తే కానీ చెప్పలేం. 

ఇక ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమయ్యే ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ద్వారా వ్యాఖ్యాతగా తానేంటో నిరూపించుకున్నారు బాలయ్య. తనదైన వాక్చాతుర్యం, అల్లరితో ఓ లెవల్లో ఆయన సందడి చేస్తున్నారు. షోకు వచ్చే హీరోలు, హీరోయిన్లతో ఆయన మాట్లాడే తీరు అందర్నీ అలరిస్తోంది. అందుకే వ్యూస్ పరంగా ‘అన్‌స్టాపబుల్’ దుమ్మురేపుతోంది. అలాంటి బాలయ్య బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తే మాత్రం షోకు ఒక రేంజ్‌లో వ్యూస్ వస్తాయని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కాగా, రీసెంట్‌గా ముగిసిన బిగ్‌బాస్ సీజన్ 6 (Bigg Boss Season 6)లో సింగర్ రేవంత్ గెలుపొందారు. ట్రోఫీతోపాటు రూ.10 లక్షల ప్రైజ్‌మనీని ఆయన దక్కించుకోగా.. రన్నరప్‌గా నిలిచిన శ్రీహాన్ ఏకంగా రూ.40 లక్షలను సొంతం చేసుకున్నారు. 

Read more: Tollywood : చిరు, బాలయ్య, నాగ్, వెంకీ ఏం చదువుకున్నారో తెలుసా? టాప్‌10 టాలీవుడ్‌ స్టార్ హీరోల క్వాలిఫికేషన్స్‌

You May Also Like These