Unstoppable2 Promo: జయసుధ, జయప్రద, రాశీ ఖన్నా (Raashi Khanna) తో బాలయ్య (Nandamuri Balakrishna) అల్లరే అల్లరి!

Advertisement
లేటెస్ట్ ఎపిసోడ్ గెస్ట్స్ గా సీనియర్ హీరోయిన్స్ జయసుధ (Jayasudha), జయప్రద (Jayaprada) హాజరయ్యారు. వీరితో ఈ తరం యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా జాయిన్ అయ్యారు.

Unstoppable Season2: టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ సీజన్2’ టాక్ షో చాలా సందడిగా సాగుతోంది. అన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో సీజన్ 2 ను ప్రారంభించారు. దీంతో సీజన్ 2 కూడా అదే రేంజ్ లో దూసుకువెళ్తోంది. ప్రతీ ఎపిసోడ్ నిజంగా అన్ స్టాపబుల్ అనిపిస్తోంది. ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మాచో మ్యాన్ గోపీచంద్ (Gopichand) ఈ టాక్ షోలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. దానికి సంబంధించిన ప్రోమో ఫుల్లుగా వైరల్ అయింది. 

ఇక, ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మెగా ఎపిసోడ్ డిసెంబర్ డిసెంబర్ 30న ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షోకి రాబోతున్నాడని అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే, ప్రభాస్ కి సంబంధించిన ఎపిసోడ్ కారణంగా ఈ వార్తలు పెద్దగా వైరల్ కాలేదు. కానీ, బాలయ్య-పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి ఎపిసోడ్ డిసెంబర్ 27న షూటింగ్ జరగవచ్చని తెలుస్తోంది. 

Advertisement

ఇదిలా ఉంటే.. లేటెస్ట్ ఎపిసోడ్ గెస్ట్స్ గా సీనియర్ హీరోయిన్స్ జయసుధ (Jayasudha), జయప్రద (Jayaprada) హాజరయ్యారు. వీరితో ఈ తరం యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా జాయిన్ అయ్యారు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఇక, ప్రోమోలో భాగంగా బాలయ్య ముగ్గురు హీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేశారు. ‘జై బాలయ్య’ సాంగ్ కు రాశీఖన్నాతో పాటు జయసుధ, జయప్రద డ్యాన్స్ చేయడం గమనార్హం. రాశీ ఖన్నాని అయితే తెగ పొగిడేసాడు బాలయ్య. ఆమె స్మైల్ కి పడిపోయాను అంటూ సరదాగా రాశిని ఆటపట్టించారు.

కాగా, ఈ ఎపిసోడ్ డిసెంబర్ 23న ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, హీరోయిన్ రాశి ఖన్నాను (Raashi Khanna) బాలయ్య ఒక క్రేజీ ప్రశ్న అడిగారు. నువ్వు జతకట్టిన హీరోలలో నీ క్రష్ ఎవరో చెప్పమని అడిగారు. ఆ ప్రశ్నకు రాశి తడుముకోకుండా... విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అని సమాధానమిచ్చంది. ఆ తర్వాత రాశీఖన్నా తన స్వీట్ వాయిస్ తో ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలోని ఏం సందేహం లేదు పాటను అద్భుతంగా పాడి మెప్పించారు.   

అనంతరం సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగి జయప్రద (Jayaprada), జయసుధని ఇరుకున పడేశారు బాలయ్య. అలాగే ఈ ముగ్గురి హీరోయిన్స్ ని కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా అడిగారు. ‘హీరోయిన్ అవ్వాలంటే పరిశ్రమలో కొన్ని కాంప్రమైజ్ లు తప్పవు, హీరోయిన్ సెంట్రిక్ సినిమాలపై డబ్బులు పెట్టడానికి ప్రొడ్యూసర్లు 100 సార్లు ఆలోచిస్తారు’ నిజమా? అబద్ధమా? అంటూ కాంట్రవర్సీ ప్రశ్నలు బాలయ్య అడిగారు.

Read More: Unstoppable With NBK Season2: 'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే' తర్వాతి ఎపిసోడ్ లో పవర్ స్టార్.. ఈ వార్తలో నిజమెంత?

Credits: Instagram
Advertisement
You May Also Like These
Advertisement