Heroine Sree Leela: 'పెళ్లి సంద‌D' హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు.. పెద్దమ్మ తల్లి గుడిని సందర్శించిన బ్యూటీ!

Published on Jun 14, 2022 03:44 PM IST

Heroine Sree Leela: దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన 'పెళ్లి సంద‌D' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల‌ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. ఈ భామకు మొద‌టి సినిమాతోనే యూత్‌లో విప‌రీతమైన క్రేజ్ వ‌చ్చింది. తన అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల చూపును త‌న‌వైపు తిప్పుకుంది. ఈ సినిమా విజ‌యంలో ఈమె కీల‌క‌పాత్ర వ‌హించిందని చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమా త‌ర్వాత‌ శ్రీలీల‌కు వ‌రుస‌గా అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. యువ హీరోల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. కాగా, మంగ‌ళ‌వారం శ్రీలీల పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ బ్యూటీ తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి వద్ద దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

మంచి గ్లామ‌ర్ తో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో (Tollywood) ల‌క్కీస్టార్ గా మారిపోయింది ఐదారు సినిమాల్లో న‌టిస్తోంది. ర‌వితేజ ధ‌మాకా, నితిన్-వ‌క్కంతం వంశీ ప్రాజెక్ట్‌, న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజుతో పాటు మ‌రికొన్ని చిత్రాలు చేస్తోంది. తాజాగా ఈ సొగ‌స‌రి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ అందుకుంది. మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్ తో జోడీక‌ట్ట‌బోతోంది. ఉప్పెన‌, కొండ‌పొలం సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాడు వైష్ణ‌వ్‌తేజ్‌. అత‌డు హీరోగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సంస్థ‌లు ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాయి. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌తేజ్‌కు జోడీగా శ్రీలీల న‌టించ‌నున్న‌ది. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. శ్రీలీల పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు చెబుతూ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకిరానుంది.

ఇక, ఈ అమ్మడి వయసు ప్రస్తుతం కేవలం 20 ఏళ్ళు మాత్రమే. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా టాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అలాగే మిగతా ఇండస్ట్రీలలో కూడా ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ లకు సైతం సవాల్ విసురుతోంది. ఈమె నటన, అందం, అందాల ఆరబోతలో కూడా అభ్యంతరం చెప్పకపోవడం వంటివి ఈమెకు ప్లస్ అయ్యాయి. ఇప్పుడు ఈ బ్యూటీ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

శ్రీలీల చేతిలో ప్ర‌స్తుతం మూడు, నాలుగు సినిమాల‌ున్నాయి. అందులో ‘ధ‌మాకా’ ఒక‌టి. మాస్‌ మహారాజ ర‌వితేజ (Raviteja) హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి త్రినాధ్ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా మేకర్స్ శ్రీలీలా పోస్టర్‌ను విడుద‌ల చేస్తూ బ‌ర్త్‌డే విషెస్‌ను వెల్ల‌డించారు. బెంచ్‌పై కూర్చొని చేయిపై త‌ల‌ను వాల్చి దీనంగా చూస్తున్న‌ట్లు పోస్ట‌ర్‌లో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ల‌పై అభిషేక్ అగర్వాల్‌, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు శ్రీలీలా నితిన్-వ‌క్కంతం వంశీ సినిమాలో న‌టిస్తుంది. బాల‌కృష్ణ‌-అనీల్ రావిపూడి చిత్రంలో బాల‌కృష్ణ కూతురు పాత్ర‌లో న‌టిస్తుంది. వీటితో పాటుగా మంత్రి గాలిజ‌నార్థ‌న్ రెడ్డి కుమారుడు కిరీటీ డెబ్యూ మూవీలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాలు రిలీజ్ అయితే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం.

Read More: Mass Maharaj Raviteja: మ‌రోసారి వాయిదాప‌డ్డ ‘రామారావు ఆన్ డ్యూటీ’.. ఆ గొడ‌వ‌లే కార‌ణ‌మా?