Director Anudeep KV: ఫుల్ ఫామ్ లో ఉన్న జాతిరత్నాలు డైరెక్టర్.. ఇంకో హిట్ కొడతాడా?

Published on Jun 24, 2022 09:55 PM IST

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ (Producer Suneel Narang) కుమార్తె జాన్వీ వివాహం గురువారం రోజున హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ కూడా హాజరయ్యారు. ఆయనతో పాటు శివ కార్తికేయన్ తర్వాతి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్ అనుదీప్ కూడా హాజరయ్యాడు. కాగా, ఆయన హీరోగా ప్రిన్స్ అంటూ తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తున్నాడు 'జాతిరత్నాలు' డైరెక్టర్ అనుదీప్ కెవి. 

ఈ సినిమాను దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వరుస హిట్లతో దూసుకెళ్తున్న శివ కార్తికేయన్ కు అనుదీప్ కెవితో కలిసి సినిమా చేయడం ఆడియెన్స్ ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఈ సినిమాలో కూడా జాతిరత్నాలు (Jathiratnalu Movie) మార్క్ చూపిస్తే మాత్రం డైరక్టర్ అనుదీప్ స్టార్ డైరక్టర్ గా మరో మెట్టు ఎక్కినట్టే అని చెప్పొచ్చు. ప్రిన్స్ హిట్ పడితే శివ కార్తికేయన్ కు తెలుగులో మరింత మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. కాగా, ఈ సినిమాలో సత్యరాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. 

టాలెంట్ ఉండాలే కాని చేసిన ఒక్క సినిమాకే సూపర్ క్రేజ్ తెచ్చుకునే దర్శకులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఖచ్చితంగా జాతిరత్నాలు డైరక్టర్ అనుదీప్ కెవి (Director Anudeep KV) అని చెప్పొచ్చు. అతను తీసిన సినిమానే కాదు అతనితో చేసిన ఇంటర్వ్యూస్ కూడా ఆడియెన్స్ ని అలరించాయంటే అతని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. 

ఇదిలా ఉంటే.. ఈ పెళ్లిలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శివకార్తికేయన్ (Hero Siva Karthikeyan) తో కలిసి ముచ్చటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శివ కార్తికేయన్ పవర్ స్టార్ ఒకరినొకరు హగ్ చేసుకుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఇక, ఈ వీడియో చూసిన శివకార్తికేయన్ ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ ఊహించని కాంబో ని చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదే వేడుకలో మరికొంత మంది టాలీవుడ్ సినీ ప్రముఖులు సందడి చేశారు. 

Read More: Hero Prabhas: బక్కపలుచగా 'బాహుబలి'.. ప్రశాంత్ నీల్ సూచనతో డాషింగ్ లుక్ లో రెబల్ స్టార్!