Suneel Narang: అంగరంగ వైభవంగా నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె పెళ్లి.. టాలీవుడ్ ప్రముఖుల హాజరు!

Published on Jun 24, 2022 07:15 PM IST

సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్‌ (Suneel Narang) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమార్తె.. జాన్వీ నారంగ్ వివాహ మహోత్సవం ప్రస్తుతం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఆదిత్యతో ఆమె ఏడడుగులు వేశారు. ఈ వివాహ మహోత్సవంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్టార్‌ హీరోలు సందడి చేశారు. మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

ఈ మహోత్సవ వేడుకకు టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున (Akkineni Nagarjuna), దర్శకుడు శేఖర్‌ కమ్ముల, బోయపాటి శ్రీను, హరీశ్‌ శంకర్‌, ప్రశాంత్‌ వర్మ, అనుదీప్‌, తమిళ హీరో శివకార్తికేయన్‌తో పాటు నిర్మాతలు సురేశ్‌ బాబు, సి.కల్యాణ్‌, నాగవంశీ, మిర్యాల రవీందర్‌రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌, హరీశ్‌ రావు  సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, వెటరన్ పంపిణీదారుడు, ఎగ్జిబిటర్ ఏషియన్ సినిమాస్ అధినేత కీ.శే నారాయణ దాస్ నారంగ్ మనవరాలు జాన్వీ నారంగ్ (jhanvi narang) వివాహ మహోత్సవ వేడుక కన్నుల పండుగను తలపించింది. హైదరాబాద్ హైటెక్స్ నోవాటెల్ లో రాయల్ వెడ్డింగ్ నుంచి తాజాగా పెళ్లి వేదిక సెట్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ టాప్ స్టార్లు అగ్ర నిర్మాతలు పంపిణీ దారులు ఎగ్జిబిటర్లు సహా భారీగా ఆర్టిస్టులు సాంకేతిక నిపుణులు కూడా అటెండ్ అయ్యారు. 

దర్శకులలో శేఖర్ కమ్ముల త్రివిక్రమ్ (Director Trivikram), ప్రశాంత్ వర్మ కనిపించారు. ఏషియన్ సినిమాస్ అధినేతలతో భాగస్వామ్యైన దగ్గుబాటి సురేష్ కూడా ఈ వేదికకు హాజరు కావడం జరిగింది అయితే వీరితో పాటు పలువురు ప్రముఖులు కూడా నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిన్నటి రోజున జరిగిన ఈ వివాహానికి నాగార్జున, నాగచైతన్య ఫోటోలు తీయడానికి అక్కడున్న ఫోటోగ్రాఫర్లు సైతం పోటీపడ్డారు.ఇక ఇంత మంది సినీ సెలబ్రిటీలు సైతం ఈ వేడుకకు హాజరు అవ్వడం తో అక్కడ మరింత ప్రేక్షకులకు ఉత్సాహం నెలకొంది అని చెప్పవచ్చు. 

ఇక, డైరెక్టర్ త్రివిక్రమ్ తో వివాహానికి వచ్చారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) ఎప్పటిలాగానే వైట్ డ్రెస్సులు అదరగొట్టేశాడని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో 24 శాఖల నుంచి ప్రేమికులంతా ఈ వివాహానికి హాజరయ్యారు టాలీవుడ్ లోనే అత్యంత కాస్ట్లీ వెడ్డింగ్ ఇదే అని సమాచారం. హైదరాబాద్ హైటెక్ లో జరిగిన ఈ పెళ్లి కోసం నారాయణ్ కుటుంబీకులు కోట్లాది రూపాయలను ఖర్చు చేసినట్లుగా సమాచారం. ఈ పెళ్లి కోసం సెట్స్ నిర్మాణం చూస్తుంటే కళ్లు చెదిరిపోతున్నాయి.పద్మావత్ భాజీరావ్ మస్తానీ సినిమాల కోసం సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన సెట్స్ కంటే గ్రాండియర్ గా ఈ సెట్స్ కనిపిస్తున్నాయ్.భారీతనం నిండిన సెట్ల నిర్మాణం కోసమే ఏకంగా కోటి ఖర్చయ్యి ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. 

Read More: Megastar Chiranjeevi: 'సూపర్ స్టార్' రజినీకాంత్ వాకింగ్ స్టైల్‌ను ఇమిటేట్ చేసిన చిరంజీవి.. వీడియో వైరల్!