Raai Laxmi: స్పెషల్ సాంగ్స్ తో రెచ్చిపోతున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోయిన్ రాయ్ లక్ష్మీ..!

Published on Jul 23, 2022 08:18 PM IST

Raai Laxmi: హీరోయిన్ లక్ష్మీరాయ్.. ఈ పొడుగు కాళ్ల సుందరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో పరిచయమైన లక్ష్మీరాయ్ ఇప్పుడు రాయ్ లక్ష్మీగా మారింది. టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన ఈ భామ అక్కడ తన అందచందాలతో అవకాశాలను బాగానే సొంతం చేసుకుంది. ఆమె నటించిన పలు సినిమాలో తెలుగులోకి అనువాదమై మంచి ఫలితాలు కూడా పొందాయి.

లక్ష్మీ రాయ్.. విలక్షణమైన పాత్రల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఈ అమ్మడికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. తెలుగులో ముఖ్యంగా 'బలుపు' 'సర్దార్ గబ్బర్ సింగ్' వంటి చిత్రాలలో నటించి తెలుగు వారికి దగ్గరైంది ఈ అమ్మడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో 'రత్తాలు రత్తాలు' సాంగ్ కి చిందేసి లక్ష్మీరాయ్ ఇండస్ట్రీలో పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ కి చెక్కేసింది.

‘జూలీ 2’ (Julie 2) సినిమాతో బాలీవుడ్ లోనూ తన హాట్ అందాలను ప్రదర్శించింది ఈ బ్యూటీ. అయితే, అక్కడా అమ్మడికి లక్ కలిసి రాలేదు. అయితేనేం, ఆమె ఇప్పుడు మలయాళం రంగంలోకి అడుగుపెట్టి.. మమ్మూటి పక్కన నటించే ఛాన్స్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు కాస్త సన్నబడింది.

లక్ష్మీ రాయ్ (Raai Laxmi).. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. తీరిక దొరికినప్పుడల్లా ఈ ముద్దుగుమ్మ ..టూర్ లకు వెళుతూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే పలు ప్రదేశాలను తిరుగుతూ అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. 

Read More: అందాలతో అదరగొడుతున్న పొడుగు కాళ్ల సుందరి రాయ్ లక్ష్మీ..!