Malavika Mohanan: హాట్ ఫోటో షూట్లతో సెగలు రేపుతున్న 'మాస్టర్' (Master Movie) బ్యూటీ మాళవిక మోహనన్..!

Published on Jul 08, 2022 01:37 PM IST

కోలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan).. తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. దళపతి విజయ్-మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి నటించిన ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది మాళవిక. ఈ సినిమా తెలుగులోనూ చక్కటి విజయం సాధించింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తోనూ 'పేట' సినిమాలో కలిసి నటించింది. 

మాళవిక మోహనన్ తండ్రి మోహనన్ స్వయానా డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కావడంతో ముంబయి విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన ఆమె తరువాత చదువుకోకుండా తన తండ్రి తో పాటు సినిమాటోగ్రఫీ మీద ఆసక్తి పెంచుకుంది. ఇక మాళవిక ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ కుర్రకారుక నిద్ర కరువు చేస్తున్నారు. తాజాగా మాళవిక మరో అద్భుతమైన ఫోటోషూట్ ని (Malavika Mohanan Photo Shoot) తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో మాళవిక లుంగీ కట్టి స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. 

అయితే, ఒకపక్క తెలుగులో అలాగే మరోపక్క బాలీవుడ్ (Bollywood) లో కూడా సత్తా చాటాలని చూస్తున్న మాళవిక మోహనన్ ఈ మధ్యకాలంలో వరుస హాట్ ఫోటో షూట్లు వదులుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. హిందీలో 'యుద్ర' అనే ఒక సినిమాలో ఆమె ప్రస్తుతం నటిస్తోంది. అయితే ధనుష్ తో చేసిన 'మారన్' అనే సినిమా మాత్రం ఆమెకు మరో డిజాస్టర్ ను అందించింది. 

కాగా, మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఇప్పటివరకు స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయలేదు. ఈ యంగ్ బ్యూటీ త్వరగా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని కుర్రకారు కోరుకుంటున్నారు. మమ్ముట్టి చేస్తున్న ఒక ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ కోసం ఆమె కూడా తండ్రి తో పాటు పని చేసింది. ఆ యాడ్ లో తండ్రికి సాయం చేస్తున్న అమ్మాయి బాగుండడంతో ఆమెకు నటన మీద ఆసక్తి ఉందనే విషయం తెలుసుకున్న మమ్ముట్టి తన కుమారుడు సల్మాన్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చారు. 

ఇదిలా ఉంటే.. మాళవిక తాజాగా ట్విట్టర్‌లో తన ఫాలోవర్స్‌తో ముచ్చటించారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా.. మీరు తమిళ్ సూపర్ స్టార్స్‌ అయిన విజయ్, రజనీకాంత్‌తో (Rajinikanth) పనిచేశారు.. ఇప్పుడు ఎవరితో నటించాలనీ కోరికగా ఉంది.. అంటూ ఓ ఫాలోవర్ వేసిన ప్రశ్న వేశారు. దీనికి సమాధానంగా మాళవిక విజయ్ దేవరకొండతో నటించాలనీ ఉందని తెలిపారు. విజయ్‌తో ఓ రొమాంటిక్ కామెడీ గానీ, లేదా రొమాంటిక్ జానర్‌లో ఓ సినిమా చేయాలనీ ఉందని తెలిపారు. 

Read More: Rakul Preeth Singh: ర‌కుల్ ప్రీత్ సింగ్‌ అస్సలు తగ్గడం లేదుగా.. అందాల విందు చేస్తున్న బ్యూటీ!