Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ లో సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో వైరల్!

Published on Jun 13, 2022 12:20 PM IST

తెలుగులో సింగింగ్ షో అనగానే అందరికీ గుర్తుకు వచ్చే షో ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol). ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రమే కాకుండా చాలా మంది సౌత్ ప్రేక్షకులకు కూడా ఇండియన్ ఐడల్ అంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ఓటీటీ 'ఆహా' వారు తెలుగు ఇండియన్ ఐడల్ ను షురూ చేసిన విషయం తెల్సిందే. అయితే, ఉత్తరాది ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో తెలుగు వారు కూడా పాల్గొని గెలిచిన సందర్బాలు కూడా ఉన్నాయి. 

ఇదిలా ఉంటే.. ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ షో ముగింపు దశకు చేరుకుంది. ఇటీవల జరిగిన సెమీఫైనల్ ఎపిసోడ్స్ కు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరు కాగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ (Grand Finale) కు మెగాస్టార్ చిరంజీవి  ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అయితే, ఇంతకుముందు చిరంజీవి తెలుగు బిగ్ బాస్ రెండు సీజన్ ల గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ ఎపిసోడ్స్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండియన్ ఐడల్ షో యొక్క గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అతి త్వరలోనే ఆహా లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ ఎపిసోడ్స్ కు సంబంధించిన స్టిల్స్, వీడియోలను నిర్వాహకులు విడుదల చేశారు. 

ఆ ఫొటోలు, వీడియోల్లో చిరంజీవి తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీని ఆవిష్కరించాడు. ఇక, ఈ కార్యక్రమంలో చిరంజీవితో  పాటు విరాటపర్వం చిత్ర హీరోహీరోయిన్లు.. రానా, సాయి పల్లవి (SaiPallavi) కూడా ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి హాజరయ్యారు. సంగీత దర్శకుడు తమన్, సింగర్ కార్తిక్, హీరోయిన్ నిత్యా మీనన్ జడ్జీలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో ఫినాలేకు రంగం సిద్దమయింది. 

ఈ షో కోసం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అనేక వేల మందిని వడపోసిన తర్వాత మొత్తం 12 మందిని గాయకులను ఎంపిక చేశారు. అలా మొదలైన ఈ షో నుంచి ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తూ.. చివరకు ఆరుగురిని సెమీ ఫైనల్ కు పంపించారు. ఇక షోలో తనదైన స్టైల్‌లో కంటెస్టెంట్లతో చిరంజీవి (Megastar Chiranjeevi) సందడి చేశారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు తొలి ఇండియన్ ఐడల్ ట్రోఫీని ఎవరు గెలుచుకుంటారో అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 17న ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మరి తెలుగు ఇండియన్ ఐడల్ తొలి సీజన్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో అనేది చూడాలి.

Read More: Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ లో అలిగిన గెస్ట్ ఉషా ఉతుప్.. క్షమాపణ చెప్పిన శ్రీరామచంద్ర