‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయడంతో విదేశాల్లోనూ ఈ చిత్రం మంచి ఆదరణను దక్కించుకుంది. ఈ మూవీ ఇటీవలే జపాన్‌లో రిలీజై అక్కడా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ చిత్రంలో నటిస్తున్న చరణ్.. ఆ తర్వాత చేసే ప్రాజెక్టుపై ఇంకా స్పష్టత రాలేదు. పాన్ ఇండియా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. కథల ఎంపికలో ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చరణ్ చేయాల్సిన చిత్రం సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే ఆగిపోయింది. ఈ విషయాన్ని ఆయన టీమ్ ప్రకటించింది. దీంతో మెగా వారసుడు చేసే తర్వాతి సినిమా ఏంటనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఇటీవలే ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో కలసి మూవీ చేసేందుకు చరణ్ చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వినిపించాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సిద్ధం చేసిన కథను బుచ్చిబాబు వినిపించగా.. కథ నచ్చినప్పటికీ చరణ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.
బుచ్చిబాబు గురువు సుకుమార్‌తో చరణ్ ఓ సినిమాకు ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌ను ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు ముందే చరణ్‌తో సుకుమార్ తెరకెక్కించారని తెలిసింది. ఈ విషయాన్ని ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ బయటపెట్టారు. అయితే దీనిపై సుకుమార్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలాఉంటే.. చెర్రీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి తాజాగా మరో క్రేజీ వార్త హల్‌చల్ చేస్తోంది. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’ (Bimbisara) ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఈ సినిమాతో వశిష్ట (Mallidi Vasishta) దర్శకుడిగా పరిచయమయ్యాడు.
డైరెక్ట్ చేసిన తొలి సినిమానే బాగా డీల్ చేశాడని వశిష్టకు మంచి పేరు వచ్చింది. ఈ యంగ్ డైరెక్టర్‌తో ఓ చిత్రం చేసేందుకు చరణ్ చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఈ మూవీని పెద్ద బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ వ్యయంతో ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కిస్తారని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే పాన్ ఇండియా చిత్రాన్ని తీసే అవకాశాన్ని వశిష్ట దక్కించుకున్నట్లేనని చెప్పాలి. ఈ మూవీకి సంబంధించి త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Follow Us